సిగ్గులేదురా.. అంటూ రెచ్చిపోయిన తమన్నా | Bigg Boss 3 Telugu Tamanna Simhadri Fires On Ravikrishna | Sakshi
Sakshi News home page

సిగ్గులేదురా.. అంటూ రెచ్చిపోయిన తమన్నా

Published Mon, Aug 5 2019 6:24 PM | Last Updated on Mon, Aug 5 2019 6:42 PM

Bigg Boss 3 Telugu Tamanna Simhadri Fires On Ravikrishna - Sakshi

బిగ్‌బాస్‌లో అందరిదీ ఓ దారి అయితే వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమాన్న సింహాద్రిది ఓ దారి. ఎప్పుడు ఎవరితో మంచిగా ఉంటుంది? ఎప్పుడు ఏం మాట్లాడుతుంది? అన్నది ఎవరికీ తెలియడం లేదు. ఇంట్లోకి వచ్చిన వెంటనే వరుణ్‌ సందేశ్-మహేష్‌ వ్యవహారంలో వరుణ్‌ సందేశ్‌ను తిడుతూ.. మహేష్‌కు సపోర్ట్‌చేసింది. అయితే వరుణ్‌ సందేశ్‌-తమన్నా కలిసి జైల్లో ఉండటంతో తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు కనపడుతోంది. ప్రస్తుతం వరుణ్‌తో బాగానే ఉంటుంది. ఇక రవికృష్ణను పండు పండు అంటూ ఆటపట్టించడం.. రవికృష్ణ ఏదైనా అంటే అతనిపై మళ్లీ సీరియస్‌ అవుతోంది. (పునర్నవికి షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌)

ఇక మొన్నటి పవర్‌ గేమ్‌ టాస్క్‌లో అలీరెజా కింగ్‌గా మారడం.. మగవారిని ఆడవారిగా మారమని.. వారితో డ్యాన్సులు చేయించడం తెలిసిందే. ఈ ఘటనలో అలీపై తమన్నా ఎంతలా విరుచుకుపడిందో అందరం చూశాం. ఇక మళ్లీ ఆ గొడవలు సమసిపోయి ఆ ఇద్దరూ కలిసిపోయారని అనుకుంటే.. శనివారం నాటి ఎపిసోడ్‌లో మళ్లీ మొదటికి వచ్చింది. ఇక తమన్నా వ్యవహారంపై ఇంటిసభ్యులందరూ విసిగిపోయి ఉండగా.. నేడు జరిగే నామినేషన్‌ ప్రక్రియలో తనను నామినేట్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే రవికృష్ణ.. తమన్నాను నామినేట్‌ చేయడం.. దానికి గల కారణాలను వివరిస్తూ ఉంటే.. అతనిపై ఘాటుగా స్పందించడం.. సిగ్గులేదురా అంటూ వ్యాఖ్యానించడం రీసెంట్‌గా విడుదల చేసిన ప్రోమోలో కనపడుతోంది.

ఇప్పటికే పునర్నవి భూపాలం తనను తాను ఎలిమినేట్‌ చేసుకోవడం.. దీనిపై బిగ్‌బాస్‌ స్పందిస్తూ సీజన్‌ మొత్తం నామినేట్‌ చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటే.. తాజాగా తమన్నా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న ప్రోమోను వదిలారు. మొత్తానికి నేటి నామినేషన్‌ ప్రక్రియ ఇంట్లో పెద్ద చిచ్చును పెట్టినట్లు తెలుస్తోంది. అసలింతకి ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలియాంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. అయితే ఈ వారంలో తమన్నా నామినేషన్స్‌లో ఉండబోతోందని, మూడో ఎలిమినేషన్‌లో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లనుందని ఇప్పటినుంచే సోషల్‌ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement