నటి సెల్ ఫోన్ కొట్టేశారు.. | Bike-borne men rob actress Arshi Khan's cellphone | Sakshi
Sakshi News home page

నటి సెల్ ఫోన్ కొట్టేశారు..

Published Mon, Nov 9 2015 7:58 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

నటి సెల్ ఫోన్ కొట్టేశారు.. - Sakshi

నటి సెల్ ఫోన్ కొట్టేశారు..

ముంబై: బాలీవుడ్ నటి, మోడల్ అర్షి ఖాన్ మొబైల్ ఫోన్ను ఇద్దరు దుండగులు చోరీ చేశారు. ఆమె ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో బైక్ పై వచ్చిన ఆగంతకులు ఫోన్ను లాక్కొని వెళ్లారు. సబర్బన్ మలాడ్లోని ఇన్ఫినిటీ మాల్ సమీపంలో ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. చోరీకి గురైన సెల్ ఫోన్ ఖరీదు దాదాపు రూ.55000 ఉంటుందని అర్షి ఖాన్ మేనేజర్ రాజేశ్ సింగ్ తెలిపారు. చోరీపై ఆమె బాన్గుర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పాక్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో తనకు శారీరక సంబంధం ఉందని ఆర్షిఖాన్.. సెప్టెంబర్ లో తన ట్విటర్ పేజీలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. 'ఆఫ్రిదితో ఏకాంతంగా గడిపా. ఎవరితోనైనా ఏకాంతంగా గడపాలంటే ఇండియా మీడియా పర్మిషన్ కావాలా? ఇది నా వ్యక్తిగత జీవితం' అంటూ సంచలన ట్వీట్ చేసి అప్పట్లో  ఆమె వార్తల్లో నిలిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement