అనుష్క ఒడి చేరిన పసి శునకం
అనుష్క ఒడి చేరిన పసి శునకం
Published Mon, Jan 27 2014 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
కుక్కపిల్ల సబ్బు బిళ్ల కాదేదీ కవితకు అనర్హం అన్న సామెత, కుక్క పిల్ల, పిల్లి పిల్ల కాదేదీ ప్రేమకు అనర్హం అన్నట్లుగా మారింది. ముఖ్యంగా మన హీరోయిన్లకు కుక్క పిల్లల్ని పక్కలో పడుకోబెట్టుకోవడం, వాటిని ముద్దాడటం, ప్రేమతో లాలించడం అధికం అయ్యింది. జంతు సంరక్షణ అనేది ఆహ్వానించ దగ్గ విషయమే. త్రిష, ఎమిజాక్సన్ లాంటి భామామణులు జంతు సంరక్షణ సంస్థల ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కోవలో నటి అనుష్క చేరారు.
ఈ బ్యూటీ ఒక కుక్క పిల్లను దత్తత తీసుకున్నారు. ఇప్పటికే అనుష్క హైదరాబాద్‌లో జంతువుల సంరక్షణ కోసం ఆహారాన్ని అందించే సంస్థకు సాయం అందిస్తున్న ఈ ముద్దు గుమ్మ శునక రాజుల ప్రదర్శన లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన అలాంటి ఒక శునక ప్రదర్శనలో ఒక పసి శునకాన్ని దత్తత తీసుకున్నారు. అనుష్క మాట్లాడుతూ తనకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం అన్నారు. జంతు సంరక్షణ సంస్థలతో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మానవ జీవితంలో అత్యం త ప్రేమ పాత్రులుగా పెంపుడు జంతువులుంటాయన్నారు. అలాంటి వాటిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు.
Advertisement
Advertisement