Blue Cross of Hyderabad
-
అవకాశం వస్తే పదేళ్ల భవిష్యత్‌లోకి వెళ్తాను
‘‘ఒకే ఒక జీవితం’ చూసి, నాగార్జునగారు ‘మా అమ్మ అన్నపూర్ణమ్మగారు గుర్తుకు వచ్చారు.. చాలా గర్వంగా ఉంది’’ అని చెప్పడం గొప్ప అనుభూతినిచ్చింది’’ అని అమల అక్కినేని అన్నారు. శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది. ఈ చిత్రంలో హీరో శర్వానంద్ తల్లి పాత్ర చేసిన అమల మాట్లాడుతూ– ‘‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత మలయాళంలో రెండు, హిందీలో మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ చేశాను. కానీ తెలుగులో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత నేను చేసిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఐదేళ్లుగా ‘అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియా’ని నేనే చూసుకుంటున్నాను. వందల మంది విద్యార్థుల భవిష్యత్ బాధ్యత నాపై ఉండటంతో నటిగా బిజీగా ఉంటే కష్టం. అందుకే నా మనసుకు హత్తుకునే కథ, ఆ పాత్రకి నేను కరెక్ట్ అనిపిస్తే చేస్తాను. అలాంటి కథే ‘ఒకే ఒక జీవితం’. నిజాయితీతో తీసిన సినిమా ప్రేక్షకులకు ఎప్పుడూ నచ్చుతుందని ఈ మూవీ మరోసారి రుజువు చేసింది. అయితే ‘ఒకే ఒక జీవితం’ లాంటి పాత్రలు చేయడం సవాల్‌తో కూడుకున్నది. ఈ సినిమా చూసిన మా అమ్మగారు నన్ను హత్తుకుని ‘చాలా గర్వంగా ఉంది’ అనడం మర్చిపోలేను. నాగార్జునతో పాటు, మా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ చిత్రానికి డీప్‌గా కనెక్ట్ అయ్యారు. నన్ను చూడకుండా కేవలం కథ, పాత్రలతో ప్రయాణం చేశారు. నాకు గొప్ప తృప్తిని, హాయిని ఇచ్చిన సినిమా ఇది. ఈ చిత్రంలోలా టైమ్ మిషన్‌లో వెళ్లే అవకాశం వస్తే పదేళ్ల భవిష్యత్‌లోకి వెళ్తాను (నవ్వుతూ). నాగార్జునగారు, నేను ఇంట్లో ఎప్పుడూ కలిసే ఉంటాం.. మళ్లీ స్క్రీన్‌పై వద్దు (నవ్వుతూ)’’ అన్నారు. ‘బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్’కి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. మంచి వైద్యులు, మేనేజ్మెంట్, వాలంటీర్లు ఉన్నారు. నేను ఉన్నా లేకపోయినా అద్భుతమైన సేవలు అందిస్తుంది. ప్రతి శనివారం నేను కూడా స్వచ్ఛందంగా వెళ్లి పని చేస్తున్నాను. -
కుక్కల కోసం ప్రత్యేక పార్కు..!
హైదరాబాద్: కుక్కల కోసం త్వరలో నగరంలో ప్రత్యేక పార్కు. అవును నిజమే. నటి అక్కినేని అమలకు జంతువులంటే అమితమైన ప్రేమ. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు. నెక్లెస్ రోడ్డులో కుక్కలకు ప్రత్యేకంగా పార్కు త్వరలోనే ప్రారంభం కాబోతున్నదని బ్లూక్రాస్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షురాలు, నటి అక్కినేని అమల వెల్లడించారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌లో బ్లూ క్రాస్ ఆధ్వర్యంలో జంతువుల జనన నియంత్రణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మియాపూర్‌లోని 108వ వార్డులో ప్రయోగాత్మకంగా 3 వేల కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయనున్నట్లు చెప్పారు. వీధి కుక్కలు జఠిలమైన సమస్యలగా మారకముందే ప్రభుత్వాలు కళ్లు తెరవాలన్నారు. ఒక జత కుక్కలు రెండు వేల కుక్క పిల్లలకు జన్మనివ్వగలవని కాబట్టి కుటుంబ నియంత్రణ తప్పనిసరి అని చెప్పారు. పరిసరాలు, చెత్త డంపింగ్ వల్ల కుక్కల జననాలు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వెస్ట్, నార్త్‌జోన్ పరిధిలోని 1.20 లక్షల కుక్కలు ఉన్నట్లు బ్లూక్రాస్ గుర్తించిందని చెప్పారు. జీహెచ్ఎంసీలో అన్ని కుక్కలకు కుటుంబ నియంత్రణ చేసే స్తోమత బ్లూక్రాస్కు లేదని దీనికి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వం నుంచి రూపాయి తీసుకోకుండా తాము సేవ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. -
అనుష్క ఒడి చేరిన పసి శునకం
కుక్కపిల్ల సబ్బు బిళ్ల కాదేదీ కవితకు అనర్హం అన్న సామెత, కుక్క పిల్ల, పిల్లి పిల్ల కాదేదీ ప్రేమకు అనర్హం అన్నట్లుగా మారింది. ముఖ్యంగా మన హీరోయిన్లకు కుక్క పిల్లల్ని పక్కలో పడుకోబెట్టుకోవడం, వాటిని ముద్దాడటం, ప్రేమతో లాలించడం అధికం అయ్యింది. జంతు సంరక్షణ అనేది ఆహ్వానించ దగ్గ విషయమే. త్రిష, ఎమిజాక్సన్ లాంటి భామామణులు జంతు సంరక్షణ సంస్థల ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కోవలో నటి అనుష్క చేరారు. ఈ బ్యూటీ ఒక కుక్క పిల్లను దత్తత తీసుకున్నారు. ఇప్పటికే అనుష్క హైదరాబాద్‌లో జంతువుల సంరక్షణ కోసం ఆహారాన్ని అందించే సంస్థకు సాయం అందిస్తున్న ఈ ముద్దు గుమ్మ శునక రాజుల ప్రదర్శన లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన అలాంటి ఒక శునక ప్రదర్శనలో ఒక పసి శునకాన్ని దత్తత తీసుకున్నారు. అనుష్క మాట్లాడుతూ తనకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం అన్నారు. జంతు సంరక్షణ సంస్థలతో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మానవ జీవితంలో అత్యం త ప్రేమ పాత్రులుగా పెంపుడు జంతువులుంటాయన్నారు. అలాంటి వాటిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు.