ఫోకస్‌ మారిందా? | Bollywood director to make movie in Telugu with Tamanna | Sakshi
Sakshi News home page

ఫోకస్‌ మారిందా?

Published Mon, May 1 2017 11:21 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఫోకస్‌ మారిందా? - Sakshi

ఫోకస్‌ మారిందా?

తమన్నా ఫోకస్‌ మారిందా? రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాలు కాకుండా డిఫరెంట్‌ మూవీస్‌ చేయాలనుకుంటున్నారా? ప్రస్తుతం ఈ మిల్కీ బ్యూటీ ఒప్పుకుంటున్న సినిమాలను పరిశీలిస్తే ఫోకస్‌ మారిందనే అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. విషయం ఏంటంటే.. నయనతార చేసిన తమిళ లేడీ ఓరియంటెడ్‌ ‘కొలై ఉదిర్‌కాలమ్‌’ హిందీ రీమేక్‌లో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఇది కాకుండా తెలుగులో ఓ లేడీ ఓరియంటెడ్‌ మూవీ అంగీకరించారని సమాచారం.

 హిందీ దర్శకుడు కునాల్‌ కోహ్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందట. ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించి, తెలుగులో డబ్‌ చేయాలనే ఆలోచన దర్శకుడికి లేదట. తమన్నాతో నేరుగా తెలుగులోనే ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కునాల్‌ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే మిల్కీ బ్యూటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారని భోగట్టా. ఈ చిత్రం జూన్‌లో సెట్స్‌పైకి వెళుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement