'తిత్లీ' మూవీ రివ్యూ | bollywood Movie titli review | Sakshi
Sakshi News home page

'తిత్లీ' మూవీ రివ్యూ

Published Fri, Oct 30 2015 12:06 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'తిత్లీ' మూవీ రివ్యూ - Sakshi

'తిత్లీ' మూవీ రివ్యూ

టైటిల్: తిత్లీ
జానర్: ఫ్యామిలీ డ్రామా
తారాగణం: రణ్వీర్ షోరే, అమిత్ సైల్, శశాంక్ అరోర, శివానీ రఘువంశీ
డైరెక్టర్: కనుబెల్
నిర్మాత: ఆదిత్యా చోప్రా, దివాకర్ బెనర్జీ


కమర్షియల్ సినిమాలకు దీటుగా ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న చిన్న సినిమాలు కూడా ఇండియన్ స్క్రీన్ మీద మంచి విజయాలు సాధిస్తున్నాయి. అదే జానర్లో తెరకెక్కిన బాలీవుడ్ క్రైమ్ ఫ్యామిలీ డ్రామా తిత్లీ. కార్పొరేట్ నగరాలకు దూరంగా మారుమూల ప్రాంతాల్లోని కుటుంబాల జీవన స్థితిగతులు, వారి జీవన విధానాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్కు ముందే, ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద సత్తా చాటింది. అయితే భారీ తారాగణం లేకపోవటంతో బాలీవుడ్లో రిలీజ్‌కు ముందు ఆశించిన స్థాయిలో హైప్ క్రియేట్ చేయలేకపోయింది.

కథ:
ఢిల్లీకి దూరంగా ఓ మారుమూల ప్రాంతంలో తిత్లీ కుటుంబం జీవిస్తుంటారు. ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేకపోవటంతో దారి దోపిడీలకు పాల్పడుతూ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. ఇదే సమయంలో తమ దొంగతనాలకు సహకరించడానికి ఒక అమ్మాయి కూడా తమ గ్యాంగ్లో ఉంటే బాగుంటుందని భావించి, తిత్లీకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. అందుకు ఎంచుకున్న అమ్మాయి వీరి నేరాల్లో భాగం పంచుకోవటానికి అంగీకరించదు. ఉన్నత ఆశయాలతో ఉన్న ఆమె, తను అనుకున్నది సాధించేందుకు తిత్లీ ఎలా సాయం చేశాడు, ఈ సమయంలో తన కుటుంబం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడన్నదే మిగతా కథ.

విశ్లేషణ :
స్టార్ ఇమేజ్ ఉన్న నటీనటులు ఎవరూ లేకపోవటంతో పాటు, ప్రేక్షకులను థియేటర్ల వరకు తీసుకొచ్చే ఇమేజ్ ఉన్న సాంకేతిక నిపుణులు కూడా ఎవరూ లేకపోవటం తిత్లీ సినిమాకు పెద్ద మైనస్. ఇక పేదల బస్తీలో జీవన స్థితిగతులను రియలిస్టిక్ గా చూపించిన దర్శకుడు ఆ తరహా చిత్రాలను ఇష్టపడేవారిని బాగానే ఆకట్టుకున్నాడు. అయితే అవార్డ్ విన్నింగ్ సినిమాగా తెరకెక్కిన తిత్లీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నా కమర్షియల్ సక్సెస్ స్థాయిని అందుకోవటం మాత్రం కష్టంగానే కనిపిస్తోంది. రణ్వీర్ షోరే, విక్రమ్ లు తన నటనతో ఆకట్టుకోగా మిగతా వారు తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు. ఎలాంటి స్టార్ ఫేస్ లేకపోయినా కేవలం తన టేకింగ్ తోనే సినిమా స్ధాయిని పెంచాడు దర్శకుడు. రియలిస్టిక్ అప్రొచ్తో సినిమాను తెరకెక్కించిన కనుబెల్ అవార్డ్ విన్నింగ్ సినిమాల దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఓవరాల్ గా తిత్లీ రియలిస్టిక్ సినిమాలను ఇష్టపడేవారిని అలరించే క్రైమ్ ఫ్యామిలీ డ్రామా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement