హంసలదీవిలో... | Boyapati Srinu New Movie With Sai Srinivas Bellamkonda & Rakul | Sakshi
Sakshi News home page

హంసలదీవిలో...

Published Wed, Apr 19 2017 12:34 AM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

హంసలదీవిలో... - Sakshi

హంసలదీవిలో...

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రకుల్‌ప్రీత్‌ సింగ్, ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ఈ నెల 21న హంసలదీవిలో ప్రారంభం కానుంది. మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘శనివారం నాడు హైదరాబాద్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ఆదివారం నుంచి డబ్బింగ్‌ కార్యక్రమాలు మొదలుపెట్టాం. హంసలదీవి షెడ్యూల్‌లో రామ్‌–లక్ష్మణ్‌ నేతృత్వంలో భారీ ఫైట్‌ను చిత్రీకరించనున్నాం’’ అన్నారు. జగపతిబాబు, వాణీ విశ్వనాథ్, సితార, సుమన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఎం. రత్నం, కెమేరా: రిషి పంజాబీ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement