డిస్కో బాబు.. డిస్కో బాబు
మాస్ ప్రేక్షకుల పల్స్ బాగా తెలిసిన దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. ఆయన చిత్రాల్లో ఫైట్లు హైలైట్‌గా నిలుస్తుంటాయి. అందుకు తగ్గట్టే యాక్షన్ సీన్స్ కోసం భారీగా ఖర్చు పెడుతుంటారు. అయితే తొలిసారి ఆయన ఓ పాట కోసం రూ.మూడు కోట్లు ఖర్చు చేస్తుండటం ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్. అదికూడా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ వంటి యువ హీరో చిత్రానికి. బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా బోయపాటి దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘జయ జానకి నాయక’. ఈ సినిమాలో ఓ పాట కోసం మూడు కోట్ల రూపాయలతో సెట్ నిర్మించడం విశేషం.
నిర్మాత రవీందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘జయ జానకి నాయక’ సినిమా విజువల్స్ గ్రాండియర్‌గా తెలుగు సినిమాకు బెంచ్ మార్క్‌లా నిలిచిపోతాయి. వైజాగ్‌లో 3 కోట్ల రూపాయలతో ఓ భారీ సెట్ వేశాం. శ్రీనివాస్–ప్రగ్యాజైస్వాల్ల మధ్య ఎనర్జిటిక్ అండ్ రొమాంటిక్ బీచ్ ఫెస్టివల్ నేపథ్యంలో వచ్చే పాట చిత్రీకరించనున్నాం. శ్రీమణి రచించిన ‘డిస్కో బాబు డిస్కో బాబు’ అనే పల్లవితో సాగే పాటను 500 మంది ఇండియన్, ఫారిన్ డ్యాన్సర్లతో ప్రేమ్ రక్షిత్ నేతృత్వంలో తెరకెక్కించనున్నాం. ఆగస్టు 11న సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: రిషి పంజాబీ, నిర్మాణం: ద్వారకా క్రియేషన్స్.