మళ్లీ అతడే విలన్ | Boyapatis Next Has Same Villain Again | Sakshi
Sakshi News home page

మళ్లీ అతడే విలన్

Published Sun, Jun 19 2016 3:58 PM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

మళ్లీ అతడే విలన్ - Sakshi

మళ్లీ అతడే విలన్

తన సినిమాల్లో హీరో క్యారెక్టర్తో పాటు ప్రతినాయక పాత్రల మీద కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు దర్శకుడు బోయపాటి శ్రీను. అందుకే లెజెండ్ సినిమాతో జగపతిబాబును విలన్గా మార్చి మంచి బ్రేక్ ఇచ్చాడు. అదే బాటలో సరైనోడు సినిమాతో యంగ్ హీరో ఆది పినిశెట్టిని కూడా విలన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. బోయపాటి సినిమాలో విలన్ క్యారెక్టర్ అంటే హీరోకు సమానంగా ఉంటుంది. అందుకే స్టార్ ఇమేజ్ ఉన్న నటులు కూడా బోయపాటి సినిమాలో నెగెటివ్ రోల్కు సై అంటున్నారు.

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు బోయపాటి. భారీ స్టార్ కాస్ట్తో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మరోసారి ఆదినే విలన్గా సెలెక్ట్ చేసుకున్నాడట. సరైనోడు సినిమా కన్నా ఈ సినిమాతో ఆది పాత్రకు మరింత ఇంపార్టెన్స్ ఉంటుందని.. ఈ సినిమాతో ఆది రేంజ్ కూడా మారిపోంతుదన్న నమ్మకంతో ఉన్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement