బ్రూస్‌లీకి శ్రీకారం | bruce lee tamil movie opening program | Sakshi
Sakshi News home page

బ్రూస్‌లీకి శ్రీకారం

Published Tue, Oct 13 2015 4:33 AM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

బ్రూస్‌లీకి శ్రీకారం - Sakshi

బ్రూస్‌లీకి శ్రీకారం

జీవీ, ప్రకాష్‌కుమార్ బ్రూస్‌లీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. డార్లింగ్, త్రిష ఇల్లన్నా నయనతార చిత్రాల విజయాలతో యమ జోరుమీదున్న జీవీ.ప్రకాష్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తదుపరి చిత్రం బ్రూస్‌లీ. కెనన్యా ఫిలింస్ పతాకంపై సెల్వకుమార్ నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా ప్రశాంత్ పాండిరాజ్ అనే నూతన దర్శకుడు పరిచయం కానున్నారు. ఈయన నాళైయ ఇయక్కునార్ నాలుగవ సీజన్‌లో పోటీలో నిలిచారు.

ఆ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన దర్శకుడు పాండిరాజ్ వద్ద ఇదునమ్మ ఆళు, పసంగ-2 చిత్రాలకు ప్రశాంత్ పాండిరాజ్ సహాయ దర్శకుడిగా పనిచేశారన్నది గమనార్హం. ఇందులో జీవీ.ప్రకాష్‌కుమార్‌కు జంటగా కీర్తీ కర్భరదన నటిస్తున్నారు. బాలశరవణన్, మునీస్‌కాంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం చెన్నైలో నిర్వహించారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ప్రశాంత్ పాండిరాజ్ చిత్ర వివరాలు వెల్లడిస్తూ ఇప్పటి వరకు హర్రర్, రొమాంటిక్ కథా చిత్రాలను చేసిన జీవీ.ప్రకాష్‌కుమార్‌ను ఈ బ్రూస్‌లీ చిత్రంలో వేరే కోణంలో చూపించనున్నానన్నారు. ఇది చిన్న పిల్లల్ని సైతం అలరించే విధంగా వినోదం, యాక్షన్ అంటూ డిఫరెంట జార్న్‌లో ఉంటుందని చెప్పారు. చిత్ర రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి మొదలు కానుందని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement