ఇది ‘ఎవడు’ కథ కాదు
‘‘చాలా మంది ‘ఎవడు’ సినిమా కథ, ఈ సినిమా కథ ఒకటే అంటున్నారు. ఈ సినిమాకీ దానికీ సంబంధం లేదు. సైంటిఫిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ ఇది’’ అని దర్శకుడు రాజేష్ పులి చెప్పారు. ప్రిన్స్, మహత్ రాఘవేంద్ర, కృతి, సభా ముఖ్యతారలుగా మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో హారున్ గని నిర్మించిన ‘బన్ని అండ్ చెర్రి’ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని నిర్మాణ నిర్వాహకుడు ఎస్.సుధీర్‌రావు తెలిపారు. చిన్న సినిమాల్లో పెద్ద సినిమా అవుతుందని నిర్మాత గని, సంగీత దర్శకుడు శ్రీవసంత్ అన్నారు.