కురుక్షేత్ర రణరంగంలో కర్ణుడు కౌరవుల వైపు ఉండి పాండవులను ఓడించడానికి యుద్ధం చేసి ఉండవచ్చు. కర్ణుడి మరణానికి అనేక పరిస్థితులు కారణం కావచ్చు. కానీ.. కర్ణుడి దానగుణం గొప్పది. ఆయన శౌర్య పరాక్రమం అందరికీ అబ్బనిది. కర్ణుడి గొప్పతనాన్ని చెప్పేలా వెండితెరపై చాలా సినిమాలు వచ్చాయి. లేటెస్ట్‌గా హిందీలో ‘మహావీర్ కర్ణ’ అనే టైటిల్‌తో మరో చిత్రం తెరకెక్కనుంది. విక్రమ్ హీరోగా యునైటెడ్ ఫిల్మ్ కింగ్‌డమ్ పతాకంపై మలయాళంలో ‘యన్ను నిన్టే మోయిదీన్’ ఫేమ్ ఆర్.యస్. విమల్ దర్శకత్వంలో ‘మహావీర్ కర్ణ’ చిత్రం రూపొందనుంది.
‘‘హిందీలో తెరకెక్కించి మిగతా భాషల్లోకి డబ్ చేయాలనుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా పేరున్న టెక్నీషియన్స్‌ను తీసుకోవాలనుకుంటున్నాం. 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లి, వచ్చే ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ సినిమాను తొలుత పృథ్వీరాజ్‌తో తీయాలని దర్శకుడు విమల్ భావించినా ఏవో కారణాల వల్ల విక్రమ్ ఫైనలైజ్ అయ్యారని మాలీవుడ్ వర్గాల కథనం.
Comments
Please login to add a commentAdd a comment