అది నిజములే! | Cola Balakrishna new movie Nannu Vadili Neevu Polevule | Sakshi
Sakshi News home page

అది నిజములే!

Published Tue, Mar 31 2015 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM

అది నిజములే!

అది నిజములే!

ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా ‘నన్ను వదిలి నీవు పోలేవులే’ అనే చిత్రం రూపొందుతోంది. ‘అది నిజములే’ ఉపశీర్షిక. వామిక హీరోయిన్. బీప్‌టౌన్ స్టూడియోస్ పతాకంపై కోలా భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 7/జి బృందావన కాలనీ, యుగానికొక్కడు చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీరాఘవ స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూరుస్తున్నారు. ఆయన సతీమణి గీతాంజలి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా గురించి దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్నాం. ఇప్పటికే ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలో పాటలను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అమృత్, కెమెరా: శ్రీధర్, సమర్పణ: కంచర్ల పార్థసారథి.
 

Advertisement
Advertisement