ఒకరికి ఇద్దరు సోగ్గాళ్లు! | COOL! Naga Chaitanya And Akhil Kill It In Bangaraju Style, Soggade Chinni Nayana Promotions In Swing | Sakshi
Sakshi News home page

ఒకరికి ఇద్దరు సోగ్గాళ్లు!

Published Mon, Jan 11 2016 11:27 PM | Last Updated on Sun, Sep 3 2017 3:29 PM

ఒకరికి ఇద్దరు సోగ్గాళ్లు!

ఒకరికి ఇద్దరు సోగ్గాళ్లు!

‘బంగార్రాజు భలే బాగున్నాడు.. పంచెకట్టు అదిరింది’ అంటూ ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్ర స్టిల్ చూసి, ఆయన అభిమానులే కాదు.. తెలుగు ప్రేక్షకులు కితాబులిచ్చేశారు. నాగ్ ఇలా పంచెకట్టులో కనిపించడం అక్కినేని అభిమానులకు కనువిందు. ఇక, ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్ కూడా అలా కనిపిస్తే, ఇక చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. సోమవారం చైతూ, అఖిల్ అలానే దర్శనమిచ్చారు. పంచెకట్టు, చలవ కళ్లద్దాలతో కారుకి కుడి, ఎడమపక్కల స్టైల్‌గా నిలబడి చైతూ, అఖిల్ దిగిన ఫొటో బయటికొచ్చింది. ఈ ఫొటో బయటికొచ్చిన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వీర విహారం చేసింది.

‘ది న్యూ కూల్ జూనియర్ అండ్ సీనియర్ బంగార్రాజు’ అని ఆ ఫొటోకు ఓ క్యాప్షన్ కూడా పెట్టారు. నాగార్జున అంటే సరే... సినిమా చేశారు కాబట్టి, పంచె కట్టక తప్పలేదు. మరి... కొడుకులిద్దరూ హఠాత్తుగా ఈ గెటప్‌లో ప్రత్యక్షం కావడానికి కారణం ఏమిటనే విషయానికొస్తే... ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం ప్రచారంలో భాగంగా ఓ టీవీ చానల్ నాగ్, చైతూ, అఖిల్... ఈ ముగ్గుర్నీ కలిపి ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూకే తండ్రీ కొడుకులు ఇలా హాజరయ్యారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 15న రిలీజ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement