
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పలు సూచనలు చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తెలుగు ప్రజలకోసం ప్రత్యేకించి రూపొందించిన ఈ వీడియోలో ఈ బుట్టబొమ్మ స్పష్టమైన తెలుగులోనే మాట్లాడటం మరో విశేషం. ‘హాయ్ నేను మీ పూజా హెగ్డే. తెలుగు ప్రజలు అందరికీ నమస్కారం. ఇప్పుడు కంటికి కనిపించని శత్రువు కరోనాతో మనమంతా యుద్ధం చేస్తున్నాం. ఇందులో విజయం సాధించాలంటే ఇంట్లోనే ఉండాలి. ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు వెళ్లవద్దు.
ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్, గ్లవ్స్ ధరించండి. చేతులకు సానిటైజర్ రాసుకోండి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇంట్లోనే ఉండండి, భద్రంగా ఉండండి’ అంటూ పూజా పేర్కొన్నారు. ఇక టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగున్న పూజా ప్రస్తుతం తెలుగులో ప్రభాస్, అఖిల్ చిత్రాల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, అక్షయ్‌కుమార్ సినిమాల్లో నటించనుంది.
చదవండి:
‘మీరెవరు నన్ను అడగడానికి.. అది నా ఇష్టం’
బుట్టబొమ్మకు పెదవి కలిపిన బుట్టబొమ్మ
Comments
Please login to add a commentAdd a comment