Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

KSR Comment On Telangana Congress 10 Years Power1
తెలంగాణ కాంగ్రెస్‌లో పదేళ్ల లొల్లి!

తెలంగాణకు పదేళ్లు తానే ముఖ్యమంత్రినంటూ ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సహజంగానే కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపింది. చర్చోపచర్చలకు దారితీసింది. అది కాంగ్రెస్‌ పార్టీ విధానం కాదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరని కూడా అన్నారు. ఇది కాస్తా తెలంగాణ అధికార పార్టీ రాజకీయాలలో కొత్త వివాదానికి తెరదీసింది. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డి ప్రసంగిస్తూ '2034 వరకు అంటే.. పదేళ్లపాటు పాలమూరు బిడ్డ సీఎంగా ఉంటాడు. కేసీఆర్‌.. ఈ విషయాన్ని డైరీలోనో.. నీ గుండెలపైనో రాసుకో" అని సవాల్ విసిరారు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతానని, పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ప్రజలకు, ఒక ప్రాంతానికి ఇచ్చిన హామీలను నెరవేర్చుతానని చెప్పడం వరకు ఓకే. వచ్చే తొమ్మిదేళ్లు కూడా తానే సీఎం అని చెప్పడం తనపై తనకు ఉన్న నమ్మకం కావచ్చు. కానీ కాంగ్రెస్‌లో అలా బహిరంగంగా చెప్పడానికి పార్టీ అధిష్టానం కాని, ఇతర నేతలు కాని ఇష్టపడరు. రాజగోపాలరెడ్డి అభిప్రాయం కూడా అదే. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయం ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా సీఎంను నిర్ణయిస్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో ఈ విధానం ఉన్న మాట నిజమే కాని, కేంద్రంలో అధికారం లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అధిష్టానం పెద్దలు కూడా సీఎంల మార్పుపై సంచలన నిర్ణయాలు చేసే పరిస్థితి పెద్దగా కనబడదు. కర్ణాటక వ్యవహారమే దీనికి ఉదాహరణ. అక్కడ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మార్చాలని, తనను సీఎంను చేయాలని ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ డి.కె.శివకుమార్ కోరుకుంటున్నారు. అయినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలు ఇందుకు సాహసించడం లేదు. పైగా ఈ ఐదేళ్లు సిద్దరామయ్య కొనసాగవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. దానికి అక్కడ ఉండే రాజకీయ, సామాజిక అంశాలు కారణాలు కావచ్చు. అయితే.. సిద్దరామయ్య కూడా వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే సీఎం అని చెప్పుకోవడం లేదు. కానీ రేవంత్ ధైర్యంగా 2028 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తిరిగి తానే సీఎం అవుతానని చెబుతున్నారు. తన వర్గంలో విశ్వాసం పెంచడానికి ఇది ఉపయోగపడవచ్చు కానీ, పార్టీలోని ఇతర వర్గాలలో ఇది అసహనానికి కారణం అవుతుంది. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న అభ్యర్ధులు ఎక్కువే. 2014లో అయితే డజను మంది తామే అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకున్నారు. అందుకే కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌(బీఆర్‌ఎస్‌) విలీనం కాకుండా అడ్డుపడ్డారు. కేసీఆర్‌ తనకు సీఎం పదవి ఇస్తే విలీనం చేస్తానని కండిషన్ పెట్టారు. చివరికి ఒంటరిగా పోటీచేసి విజయం సాధించడంతో కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. పదేళ్లు ఆ పరిస్థితి కొనసాగడంతో కాంగ్రెస్ నేతలు నిరాశలో మునిగిపోయారు. 2018 ఎన్నికలకు కొద్దికాలం ముందు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. తదుపరి వర్కింగ్ అధ్యక్షుడుగా, అనంతరం పీసీసీ అధ్యక్షుడుగా నియమితులయ్యారు. ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటమి పాలైనా, మల్కాజిగిరి ఎంపీగా గెలవడం ఆయనకు కలిసి వచ్చింది. ఢిల్లీ స్థాయిలో పార్టీ నాయకత్వంతో సంబంధాలు పెట్టుకోగలిగారు. పార్టీ సీనియర్ నేతలు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, తదితరులు తొలుత రేవంత్ నాయకత్వానికి సుముఖత చూపలేదు. తప్పని స్థితిలో ఒప్పుకున్నారు. రేవంత్ నియామకంపై కోమటి రెడ్డి వెంకట రెడ్డి వంటివారు గట్టి విమర్శలే చేసేవారు. ఆయన సోదరుడు రాజగోపాల రెడ్డితో కలిసి తమకు పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే అధికారం సాధిస్తామని చెప్పినా అధిష్టానం వారివైపు మొగ్గు చూపలేదు. ఒక దశలో కాంగ్రెస్ నాయకత్వం అప్పటి సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని ఎదుర్కోవడానికి సరైన చర్య తీసుకోవడం లేదంటూ రాజగోపాల రెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇందుకోసం ఆయన తన ఎమ్మెల్యే పదవి కూడా వదలుకున్నారు. తదుపరి ఉప ఎన్నికలో ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత మళ్లీ 2023 జనరల్ ఎన్నికలు వచ్చేసరికి తిరిగి కాంగ్రెస్‌లో చేరిపోయి మునుగోడు నుంచే పోటీచసి విజయం సాధించారు. ఈయన సోదరుడు, సీనియర్ నేత వెంకట రెడ్డి నల్గొండ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. రాజగోపాలరెడ్డి కూడా మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. అధిష్టానం కూడా ఆయనను బుజ్జగించే యత్నం చేసింది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారన్న భావనతో ఆయనకే సీఎం పదవి అప్పగించింది. మల్లు భట్టి సీఎం రేసులో నిలిచినా ఉప ముఖ్యమంత్రి పదవితో సర్దుకోక తప్పలేదు. అలాగే ఉత్తంకుమార్ రెడ్డి, వెంకట రెడ్డి తదితర ఆశావహులు కూడా రాజీపడి రేవంత్ కేబినెట్లో మంత్రులుగా చేరిపోయారు. అయినా వీరిలో కొందరు రేవంత్ పై ఎప్పటికప్పుడు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారట. రేవంత్ ప్రభుత్వం చేసే తప్పులను, వచ్చే ఆరోపణలను తెలియ చేస్తున్నారట. రేవంత్ కూడా అంతకన్నా తెలివిగా అధిష్టానంతో సంబంధాలు కొనసాగిస్తున్నందున ఇప్పటికైతే ఆయనను కదలించే శక్తి ఇతర కాంగ్రెస్ నేతలకు ఉన్నట్లు కనిపించదు. కాంగ్రెస్ రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అది వేరే సంగతి. కాంగ్రెస్ రాజకీయాలు చూస్తే ఉమ్మడి ఏపీలో పూర్తి టర్మ్‌ పదవి కాలంలో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే కావడం విశేషం. 2004లో ఆయన నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా కొందరు ఇతర నేతలు సీఎం పదవి కోసం పోటీ పడకపోలేదు. కానీ అధిష్టానం వైఎస్ నాయకత్వానికి అంగీకరించక తప్పలేదు. అలాగే 2009లో రెండోసారి గెలిచిన పిమ్మట అప్పటి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా తనకు సీఎం పదవి కావాలని ప్రకటన చేశారు. అయినా వైఎస్సార్‌కే సీఎం సీటు తిరిగి దక్కింది. 1956 లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి దాదాపు మూడేళ్ల తర్వాత కేంద్ర రాజకీయాలకు వెళ్లారు. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు. 1962లో నీలం సంజీవరెడ్డి మళ్లీ సీఎం అయ్యారు కాని పూర్తి టర్మ్‌ ఉండలేదు. 1964లో ముఖ్యమంత్రైన కాసు బ్రహ్మానందరెడ్డి 1967 ఎన్నికల తర్వాత తిరిగి ఆ పదవి చేపట్టినా, పూర్తి కాలం కొనసాగలేకపోయారు. తరువాత పీవీ నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. జై ఆంధ్ర ఉద్యమం కారణంగా ఆయన 1972లో పదవి వదలు కోవల్సి వచ్చింది. కొంతకాలం రాష్ట్రపతి పాలన తర్వాత సీఎం అయిన జలగం వెంగళరావు 1978 వరకు కొనసాగారు. ఆ తరుణంలో పార్టీలో వచ్చిన చీలికలో 1978లో మర్రి చెన్నారెడ్డి ఇందిరా కాంగ్రెస్ పక్షాన సీఎం అయ్యారు. 1978-83 మధ్య చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకటరామి రెడ్డి, కోట్ల విజయ భాస్కరరెడ్డిలు సీఎం పదవులు నిర్వహించారు. 1983లో ఎన్టీఆర్‌ స్థాపించినన టీడీపీ అధికారంలోకి వచ్చింది. తిరిగి 1989లో కాంగ్రెస్ గెలుపొందడంతో 1989-94 మధ్య చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రులయ్యారు. 1994 లో ఓటమి పాలైన కాంగ్రెస్ మళ్లీ 2004లో అధికారంలోకి వచ్చాక వై ఎస్ సీఎం అయ్యారు. 2009లో తిరిగి ఆయన ముఖ్యమంత్రయ్యాక అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులు అయ్యారు. అంటే వైఎస్సార్‌ తప్ప ఏ ఒక్క కాంగ్రెస్ సీఎం కూడా పూర్తి టర్మ్‌ పాలించలేదన్నమాట. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా దెబ్బతినిపోగా, తెలంగాణలో పదేళ్లపాటు అధికాంలోకి రాలేదు. 2023లో రేవంత్ సీఎం అయిన తర్వాత కొంత స్వతంత్రంగా ప్రభుత్వాన్ని, పార్టీని నడపడానికి యత్నిస్తున్నారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి అవడంతో మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న వ్యక్తులు రేవంత్‌ను ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడుగానే చూస్తుంటారు. ఆయన కూడా అప్పడప్పుడు చంద్రబాబును ప్రశంసించినట్లు మాట్లాడుతుంటారు. నాగర్‌ కర్నూల్‌ సభలోనూ చంద్రబాబు ప్రస్తావన తెచ్చి మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ ప్రాజెక్టులు చేపట్టినట్లు మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించలేదు. అప్పుడప్పుడూ వైఎస్ పేరును ప్రస్తావిస్తున్నా, కాంగ్రెస్ వర్గాలకు అంత సంతృప్తి కలిగించే రీతిలో మాట్లాడడం లేదన్న భావన ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి తన వ్యాఖ్యలో నిఖార్సైన కాంగ్రెస్ నేతలు సీఎం చేసిన వ్యాఖ్యలను అంగీకరించరని అన్నారు. సాధారణంగా.. జాతీయ పార్టీలలో హై కమాండ్ దే తుది నిర్ణయం అనే సంగతి తెలిసిందే. అయితే ఇది పరిస్థితులను బట్టి, రాజకీయ పరిణామాలను బట్టి, ఆయా వ్యక్తుల బలాబలాలను బట్టి ఉంటుంది. ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ బలంపై కూడా ఆధారపడి ఉంటుంది. రేవంత్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో తనకు ఎక్కువ మద్దతు ఉండేలా చూసుకుంటున్నారు. అందువల్ల అధిష్టానం కూడా తొందరపడే పరిస్థితి ఉండదు. ఆ ధైర్యంతోనే రేవంత్ భవిష్యత్తులో కూడా తానే సీఎం అని చెప్పుకుని ఉండవచ్చు. రేవంత్ పై అసహనం వ్యక్తం చేయడం మినహా, అసమ్మతి ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేకపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

SC Set Up Special Bench To Hear Justice Yashwant Varma Plea2
జస్టిస్‌ వర్మ కోసం టాప్‌ లాయర్లు.. విచారణకు సీజేఐ దూరం

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నోట్ల కట్టల ఆరోపణల వ్యవహారంలో శరవేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు పార్లమెంట్‌లో ఆయన్ని అభిశంసించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు.. సుప్రీం కోర్టులో ఆయన వేసిన పిటిషన్‌పై ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ పిటిషన్‌ విచారణ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ బుధవారం వైదొలిగారు. ఈ పిటిషన్‌ను విచారించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయిస్తామని తెలిపారాయన. ‘‘బహుశా ఈ పిటిషన్‌ను నేను విచారణ చేయలేనుకుంటా. ఎందుకంటే.. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా(మాజీ సీజేఐ) నేతృత్వంలో జరిగిన విచారణలో నేను భాగమయ్యాను. కాబట్టి దీన్ని వేరొక బెంచ్‌కు బదిలీ చేస్తా’’ అని పిటిషన్‌ తరఫు న్యాయవాది కపిల్‌ సిబాల్‌కు సీజేఐ స్పష్టం చేశారు. మార్చి 14వ తేదీన ఢిల్లీ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహించిన జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక బంగ్లాలో అగ్నిప్రమాదం సంభవించి.. కాలిన స్థితిలో నోట్ల కట్టలు కనిపించాయి. ‘న్యాయవ్యవస్థలో అవినీతి..’ అంటూ ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు.. ఆయన్ని హుటాహుటిన అలహాబాద్‌ హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్‌ చేసింది. అదే సమయంలో ఈ ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు జడ్జిల కమిటీని ఏర్పాటు చేయించింది. ఆ కమిటీ తన నివేదికను అప్పటి చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాకు అందించగా.. ఆయన దానిని లేఖ రూపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు పంపారు. ఆ నివేదిక ప్రకారం.. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అవినీతికి పాల్పడ్డారని, స్వచ్ఛందంగా రాజీనామాకు ఆయన అంగీకరించలేదని, కాబట్టి ఆయన్ని తొలగించాలని ఇన్‌-హౌజ్‌ కమిటీ సిఫార్సు చేసింది. అయితే తన వాదన వినకుండానే చర్యలు తీసుకుంటున్నారని సుప్రీం కోర్టులో జడ్జి యశ్వంత్‌ వర్మ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఇవాళ(బుధవారం) ఆయన తరఫు లాయర్‌ కపిల్‌ సిబాల్‌ సీజేఐ బెంచ్‌ను కోరారు. జస్టిస్‌ వర్మ తరఫున కపిల్‌ సిబాల్‌తో పాటు ముకుల్‌ రోహత్గి, రాకేష్‌ ద్వివేది, సిద్ధార్థ్‌ లూథ్రాలాంటి టాప్‌ లాయర్లు వాదనలు వినిపిస్తుండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ పార్లమెంట్‌ సెషన్‌లోనే ఆయనపై అభిశంసనకు చర్యలు నడుస్తున్నాయి. ఇలాంటి అభిశంసన తీర్మానం కోసం లోక్‌సభలో కనీసం 100 మంది, రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యులు అభిశంసన నోటీసుపై సంతకం చేయాలి. అయితే జస్టిస్‌ వర్మ కేసులో ఇప్పటికే 145 మంది లోక్‌సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు ఇప్పటికే అభిశంసన నోటీసుపై సంతకం చేశారు. జడ్జి తొలగింపు కోసం భారత రాజ్యాంగంలోని 124, 217, 218 ఆర్టికల్స్‌ ప్రకారం నోటీసు దాఖలైంది. అయితే.. ఎంపీలు ఇచ్చిన అభిశంసన నోటీసును స్వీకరించిన కొన్ని గంటలకే రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి అయిన జగ్దీప్‌ ధన్‌ఖడ్‌ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.నెక్ట్స్‌ ఏంటంటే.. లోక్‌సభ స్పీకర్‌ , రాజ్యసభ ఛైర్మన్ సంయుక్తంగా ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఒకరు, ఓ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఓ ప్రఖ్యాత న్యాయవేత్త ఉంటారు. ఈ కమిటీకి నివేదిక సమర్పించడానికి మూడు నెలల గడువు ఇస్తారు. అయితే ఈ కమిటీ ముందు తన వాదనలు వినిపించేందుకు జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు అవకాశం(మూడుసార్లు) ఉంటుంది. గతంలో త్రీజడ్జి కమిటీ సమర్పించిన నివేదికతో పాటు జస్టిస్‌ వర్మ వాదనలు, సాక్ష్యాలను పరిశీలించాకే స్పెషల్‌ కమిటీ ఒక నివేదికను సమర్పిస్తుంది. ఈపై ఇరు సభల్లో ఆ నివేదికపై చర్చ జరిగాక.. అభిశంసన తీర్మానాన్నిప్రవేశపెడతారు. దానిని 2/3 మెజారిటీతో సభ్యులు ఆమోదించాక రాష్ట్రపతికి పంపిస్తారు. అప్పుడు ఆయన తొలగింపుపై రాష్ట్రపతి సంతకం చేసి ఉత్తర్వులు జారీ చేస్తారు. అయితే ప్రస్తుతం పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. అదే సమయంలో ఆయన పిటిషన్‌ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఆగష్టు 21వ తేదీతో పార్లమెంట్‌ సమావేశాలు ముగియనున్నాయి. ఈ తరుణంలో ఆయన్ని తొలగించడం ఈ సెషన్‌లో సాధ్యం కాకపోవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Minister Narayana Scolds Amaravati Workers Over Delay3
హే నోరు మూయ్.. గెట్ అవుట్.. యూజ్‌లెస్‌ ఫెలో

సాక్షి, విజయవాడ : కూటమి పాలనలో నేతలు ఎంత అమర్యాదస్తులో తెలియజేసేలా రోజుకో వీడియో బయటకు వస్తోంది. మంత్రి నారాయణ తన నోటికి పని చెప్పారు. అమరావతి రాజధాని పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ సిబ్బందిని దుర్భాషలాడారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అమరావతి పనులను మంత్రి నారాయణ తాజాగా పర్యవేక్షించారు. ఆ సమయంలో పనులు సరిగ్గా జరగడం లేదంటూ కాంట్రాక్టు సిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సివిల్ ఇంజనీర్లు చెప్పే వాస్తవ పరిస్థితి వివరిస్తున్నా వినకుండా తన ఫ్రస్టేషన్ ప్రదర్శించారు. హే నోరు మూయ్.. గెట్ అవుట్.. యూజ్‌లెస్‌ ఫెలో అంటూ అందరి ముందు ఇంజనీరింగ్ అధికారులపై చిందులు తొక్కారు.కూటమి పాలనలో నేతలు ఎంత అమర్యాదగా వ్యవహరిస్తున్నారో తెలిసిందే. జేసీ ప్రభాకరరెడ్డి, గాలి భానుప్రకాశ్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌, ఇలా ఇప్పుడు ఈ లిస్టులో నారాయణ కూడా వచ్చి చేరారు.

Pakistan: Major Blow to Imran Khan's Party4
Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు కోలుకోలేని దెబ్బ.. ఏడుగురు పీటీఐ నేతలకు పదేళ్ల జైలు

ఇస్లామాబాద్‌: పాక్‌ న్యాయస్థానం నుంచి పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్‌ ఇమ్రాన్‌కు కోలుకోలేని దెబ్బ పడింది. దేశంలో గతంలో జరిగిన అల్లర్ల కేసుల్లో ఏడుగురు పీటీఐ నేతలకు పదేళ్ల జైలు శిక్ష విధించారు. 2023, మే 9న పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్టు దరిమిలా దేశంలోని సైనిక స్థావరాలు, ప్రభుత్వ యాజమాన్యంలోని భవనాలపై పీటీఐ నేతలు దాడులకు తెగబడ్డారు. ఈ నేపధ్యంలో పలువురు నేతలతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఈ అల్లర్ల కేసులో లాహోర్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు (ఏటీసీ) తాజాగా పీటీఐకి చెందిన ఏడుగురు సీనియర్ నేతలకు పదేళ్ల జైలుశిక్ష విధించింది. కోర్టు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం జైలు శిక్ష పడిన నేతలలో సెనేటర్ ఎజాజ్ చౌదరి (పార్టీ సీనియర్ మహిళా నేత) సర్పరాజ్‌ చీమా (పంజాబ్ మాజీ గవర్నర్), డాక్టర్ యాస్మిన్ రషీద్ (పంజాబ్ మాజీ ఆరోగ్య మంత్రి) , మెహమూదూర్ రషీద్ (మాజీ మంత్రి) న్యాయవాది అజీమ్ పహత్ (పార్టీ న్యాయ సలహాదారు) ఉన్నారు. మరో ఇద్దరు నేతలు కూడా శిక్ష పడినవారిలో ఉన్నారు. అయితే పలు మీడియా నివేదికలు ఐదుగురి పేర్లను హైలైట్ చేశాయి. ఈ కేసులో పీటీఐ వైస్ చైర్మన్, మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.మరో కేసులో పంజాబ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత మాలిక్ అహ్మద్ ఖాన్ భచర్, పీటీఐ పార్లమెంటేరియన్ అహ్మద్ చట్టా, మాజీ శాసనసభ్యుడు బిలాల్ ఎజాజ్‌లకు పదేళ్ల జైలు శిక్ష విధించారు. నాడు జరిగిన అల్లర్ల తర్వాత పోలీసులు వేలాది మంది నిరసనకారులను అరెస్ట్‌ చేశారు. ఇమ్రాన్‌ఖాన్ 2023, ఆగస్టు నుండి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పీటీఐ నేతలకు విధించిన శిక్షను ఫెడరల్ ప్రభుత్వం స్వాగతించింది. దీనిని సానుకూల చర్యగా అభివర్ణించింది. కాగా పీటీఐ పంజాబ్ చాప్టర్ హెడ్ అలియా హంజా, సీనియర్ నేత బాబర్ అవాన్, శాసనసభ్యుడు అసద్ కైసర్ ఈ శిక్షలను ఖండించారు. ఈ కేసులలో చట్టపరమైన విధానాలను అనుసరించలేదని, విశ్వసనీయ సాక్షులను హాజరుపరచలేదని వారు ఆరోపించారు.

MP Dharmapuri Arvind Reacts On Raja Singh Issue5
రాజాసింగ్‌కు ఒక్క మిస్డ్‌కాల్‌ చాలు.. బండి-ఈటల వివాదంపై ధర్మపురి ఆసక్తికర వ్యాఖ్యలు

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో బీజేపీ రాజకీయాలపై ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్‌ రాజీనామా అంశంతో పాటు ఈటల-బండి మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్‌పైనా అరవింద్‌ స్పందించారు. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో బుధవారం ఆయన పార్టీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడుతూ.. ‘‘బండి సంజయ్, ఈటల రాజేందర్‌ వివాదంపై న్యూట్రల్ ఎంక్వయిరీ కమిషన్ వేయాలి. బీజేపీ పాత అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు కలిసి ఈ అంశంపై మాట్లాడాలి. అవసరమైతే అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకోవాలి’’ అని ధర్మపురి హైకమాండ్‌ను కోరారు.ఇక గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారంపై మాట్లాడుతూ.. ‘‘రాజాసింగ్‌ ఐడియాలాజికల్ మ్యాప్. కొన్ని విషయాల్లో మనస్థాపం చెందారు. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కాలేదు రాజీనామా చేశారు. ఒకవేళ ఆయన మళ్లీ పార్టీ సభ్యత్వం కావాలనుకుంటే మిస్డ్‌ కాల్‌ ఇస్తే సరిపోతుంది. మళ్లీ మెంబర్‌షిప్‌ వస్తుంది. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలి. పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలి.. ఫలితం చూపించకపోతే పక్కకు పెట్టాలి. ఏ పార్టీకైనా కార్యకర్తలు కీలకం. ఆ కార్యకర్తలు నాయకులుగా ఎదిగేందుకు ఇదే మంచి సమయం. ఇందూర్ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి మేం గెలుస్తున్నాం. ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు. బీసీ రిజర్వేషన్లపై ముందుగా సుప్రీం కోర్టులో కొట్లాడాలి అని ఎంపీ అరవింద్‌ అన్నారు.

WCL: AB De Villiers Stuns Yusuf Pathan With Insane Relay Catch Goes Viral6
IND vs SA: డివిలియర్స్‌ సంచలన ‘రిలే క్యాచ్‌’.. వీడియో వైరల్‌

సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌ (AB De Villiers) పునరాగమనంలో అదరగొట్టాడు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మైదానంలో రీఎంట్రీ ఇచ్చిన ఏబీడీ బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ అద్భుతం చేశాడు. సంచలన ‘రిలే క్యాచ్‌’(Relay Catch)తో మెరిసి.. ఇండియా చాంపియన్స్‌కు ఊహించని షాకిచ్చాడు.సౌతాఫ్రికా తరఫున 2018లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన డివిలియర్స్‌.. 2021లో ఐపీఎల్‌కూ వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో తాజాగా వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌-2025 (WCL 2025) సీజన్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ఈ టీ20 టోర్నమెంట్లో సౌతాఫ్రికా చాంపియన్స్‌ జట్టుకు ఏబీడీ కెప్టెన్‌గా ఉన్నాడు.అజేయ అర్ధ శతకంఇక ఈ టోర్నీలో తొలుత వెస్టిండీస్‌ చాంపియన్స్‌ను బాలౌట్‌లో ఓడించిన సౌతాఫ్రికా.. తమ రెండో మ్యాచ్‌లో ఇండియా చాంపియన్స్‌ను ఢీకొట్టింది. నార్తాంప్టన్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో డివిలియర్స్‌ ధనాధన్‌ దంచికొట్టాడు. అజేయ అర్ధ శతకం (30 బంతుల్లో 63, 3 ఫోర్లు, నాలుగు సిక్సర్లు)తో మెరిసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది సౌతాఫ్రికా.ఇండియా చాంపియన్స్‌కు ఓటమిఅనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌.. 18.2 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 111 పరుగులే చేసింది. ఫలితంగా డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం 88 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఇండియా బ్యాటర్‌ యూసఫ్‌ పఠాన్‌ను అవుట్‌ చేయడంలో డివిలియర్స్‌ చేసిన ప్రయత్నం హైలైట్‌గా నిలిచింది.క్యాచ్‌ పట్టి.. సహచర ఫీల్డర్‌కు అందించిఇండియా చాంపియన్స్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్‌లో ఇమ్రాన్‌ తాహిర్‌ బంతితో రంగంలోకి దిగాడు. ఈ క్రమంలో పఠాన్‌ వైడ్‌ లాంగాఫ్‌ దిశగా బంతిని గాల్లోకి లేపగా.. బౌండరీ దిశగా పయనించింది. అయితే, ఇంతలో డివిలియర్స్‌ వేగంగా పరిగెత్తుకుని వచ్చి బంతిని ఒడిసిపట్టాడు.అయితే, తాను బౌండరీ రోప్‌ను తాకే ప్రమాదం ఉండటంతో సహచర ఫీల్డర్‌ సరేల్‌ ఎర్వీ వైపు బంతిని విసిరాడు. వెంటనే స్పందించిన అతడు బాల్‌ను సురక్షితంగా క్యాచ్‌ పట్టాడు. దీంతో ఇమ్రాన్‌ తాహిర్‌ సంబరాలు చేసుకోగా.. యూసఫ్‌ పఠాన్‌ బిత్తరపోయాడు. ఇలా ఏబీడీ 41 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అన్నట్లు తన అద్భుత ఫీల్డింగ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.చదవండి: ‘అభ్యంతరకరమైన పదాలు వాడాడు’.. గిల్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌!𝐏𝐞𝐭𝐢𝐭𝐢𝐨𝐧 𝐭𝐨 𝐠𝐞𝐭 𝐀𝐁 𝐝𝐞 𝐕𝐢𝐥𝐥𝐢𝐞𝐫𝐬 𝐨𝐮𝐭 𝐨𝐟 𝐫𝐞𝐭𝐢𝐫𝐞𝐦𝐞𝐧𝐭 📑✍️Even after four years away from the game, he's making the impossible look easy 😮‍💨#WCL2025 #ABD pic.twitter.com/ixmXJ6YBSK— FanCode (@FanCode) July 22, 2025

Hansika Motwani Husband Response On Divorce Rumours7
విడాకుల బాటలో హన్సిక.. కారణం ఇదేనా?

అందానికి మారు పేరు హన్సిక(Hansika Motwani). ఈ ముంబై బ్యూటీ హిందీ, తెలుగు, తమిళం పలు భాషల్లో కథానాయకిగా నటించి పైస్థాయికి చేరుకుంది. అలా అర్ధ సెంచరీకి పైగా చిత్రాలు చేసిన హన్సిక ముఖ్యంగా తమిళంలో ధనుష్‌, విజయ్, సూర్య, శివకార్తికేయన్, సిద్ధార్థ్‌ వంటి ప్రముఖ హీరోల సరసన నటించి పాపులర్‌ అయ్యారు. కాగా కథానాయకిగా బిజీగా ఉన్న సమయంలోనే 2022లో సోహల్‌ కత్తూరియా అనే వ్యాపార వేత్తని పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఆడంబరంగా జరిగింది. కాగా సోహల్‌కు ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలితో ఆయనకు ఇంతకుముందే పెళ్లై విడాకులు తీసుకున్న వ్యక్తి కావడం గమనార్హం. కాగా పెళ్లయిన రెండేళ్లకే హన్సికకు, భర్తకు మధ్య మనస్పర్థలు తలెత్తాయని, దీంతో ఇద్దరు విడిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం వైరల్‌ అవుతోంది. సోహల్‌ది పెద్ద కుటుంబం అని, వారితో హన్సిక కలవలేకపోవడం వల్లే మనస్పర్థలు వచ్చాయని, దీంతో ఆమె తన తల్లి వద్దనే ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈవ్యవహారంపై ముంబైలోని మీడియా హన్సిక వర్గాన్ని సంప్రదించగా వారు అవునని కానీ కాదని కానీ స్పందించలేదని సమాచారం. అయితే సోహెల్‌ మాత్రం స్పందిస్తూ ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. అయితే ఆయన హన్సిక కలిసి ఉంటున్నారా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఏదేమైనా పెళ్లికి ముందు నటించడానికి అంగీకరించిన కొన్ని చిత్రాలను పూర్తి చేయడానికి హన్సిక సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం ఆమె టీవీ కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతగా, పాల్గొంటూ, వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగానే ఉన్నారు.

US Man uses ChatGPT to lose 11 kilos in 46 days, shares fitness routine and diet8
నో జిమ్‌, నో ట్రైనర్‌.. 46 రోజుల్లో 11 కిలోలు ఉఫ్‌..!

అమెరికాకు చెందిన ప్రముఖ యూ ట్యూబర్‌ కేవలం 46 రోజుల్లో 11 కిలోల బరువు తగ్గడం విశేషంగా నిలుస్తోంది. అదీ 56 ఏళ్ల వయసులో జిమ్‌కు వెళ్లకుండానే, ఎలాంటి ట్రైనర్ లేకుండానే దీన్ని సాధించాడు. అన్నట్టు ఎలాంటి ఫ్యాషన్ డైట్‌ కూడా పాటించలేదు. మరి అతని వెయిట్‌ లాస్‌ సక్సెస్‌ సీక్రెట్‌ ఏంటో తెలుసుకుందామా.పసిఫిక్ నార్త్‌వెస్ట్‌లోనివసిస్తున్న 'మిస్టర్ రాంగ్లర్ స్టార్'గా పాపులర్‌ అయిన అమెరికన్‌ కోడి క్రోన్ తన వెయిట్‌ లాస్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. చాట్ జీపీటీ వంటి ఏఐ సాయంతో తన బరువు తగ్గే ప్లాన్‌ను పక్కాగా అమలు చేశాడు. విజయం సాధించాడు. తన 56వ పుట్టిన రోజునాడు ఆరోగ్యం , ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడుకోడి క్రోన్. బరువు తగ్గాల్సిందే అని తీర్మానించుకున్నాడు. ఇందుకోసం AI ని ఆశ్రయించాడు. తన బరువు, ఎత్తు, జీవనశైలి, శారీరక స్థితిగతులను బట్టి చాట్ జీపీటీ సహాయంతో ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించుకున్నాడు. (6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే!)అలా చాట్‌జీపీటి సాయంతో 95 కిలోల నుండి 83 కిలోలకు బరువు తగ్గించుకున్నాడు కోడి. కేవలం ఒకటిన్నర నెలల్లో 25.2 పౌండ్లు (సుమారు 11.4 కిలోలు) కోల్పోయాడు. ఇందుకోసం అతను ఓజెంపిక్ లాంటి బరువు తగ్గించే మందులను ఉపయోగించ లేదు, వ్యక్తిగత కోచ్‌ను నియమించుకోలేదు. దీనికి బదులుగా ఇంట్లోనే చేయగలిగే సాధారణ వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, జీవనశైలి మార్పులకు ప్రాధాన్యత ఇచ్చాడు. క్రమశిక్షణ, క్లీన్ ఈటింగ్, స్మార్ట్ సప్లిమెంటేషన్, వ్యాయామాలు ఇవే అతని సీక్రెట్స్‌.కోడి క్రోన్‌ పాటించిన నియమాలుపోషకాహారం & ఉపవాసం : లాంగ్‌ ఫాస్టింగ్‌ తరువాత రోజుకు రెండు సార్లు సంపూర్ణ భోజనాలు. సాయంత్రం 5 గంటల తరువాత నో ఫుడ్‌అల్పాహారం: 4 గుడ్లు, అర పౌండ్ లీన్ గ్రాస్-ఫెడ్ బీఫ్, స్టీల్-కట్ ఓట్స్ (తీపి లేనివి), ఆకుకూరల సప్లిమెంట్. ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర, స్నాక్స్ . సీడ్ ఆయిల్స్ , పాల ఉత్పత్తులకు పూర్తిగా దూరం.రాత్రి భోజనం: 1/3 కప్పు జాస్మిన్ రైస్, సుమారు 225 గ్రా. లీన్ స్టీక్, ఆలివ్ ఆయిల్ లేదా సగం అవకాడో.సప్లిమెంట్లు: క్రియేటిన్, బీటా-అలనైన్, వె ప్రోటీన్, కొల్లాజెన్, మెగ్నీషియం మరియు ఇతర క్లీన్-లేబుల్ పెర్ఫార్మెన్స్ బూస్టర్‌లువర్కౌట్స్‌: ఇంట్లోనే పుల్-అప్ బార్, రెసిస్టెన్స్ బ్యాండ్‌లు, కెటిల్‌బెల్స్, డిప్ బార్ లాంటి వ్యాయామాలు చేసేవాడు. వారానికి ఆరు రోజులు, ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు వ్యాయామం.గంట నుంచి గంటన్నర పాటు ఎక్సర్‌పైజ్‌లు స్లీప్‌: 7–8 గంటల నిద్ర. మంచి నిద్ర కోసం నిద్రవేళకు ఒక గంట ముందు స్క్రీన్స్‌ ఆఫ్‌. గది అంతా చీకటిగా ఉండేలా ఏర్పాటు.రోజువారీ 4 లీటర్ల నీళ్లు తాగడం. అలాగే జీవక్రియ శక్తిని పెంచడానికి ప్రతిరోజూ ఉదయం 15–20 నిమిషాలు ఉదయం పూట సూర్యరశ్మి తగిలేలా చూసుకునేవాడు.ట్రాకింగ్ ప్రోగ్రెస్: ప్రతి ఉదయం తన ఉపవాస బరువును చెక్‌ చేసుకునేవాడు. దీన్ని బట్టి AI ప్లాన్‌ను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రణాళికను సర్దుబాటు చేసుకునేవాడు. దీంతో బరువు తగ్గడమే కాకుండాకీళ్ల నొప్పులు తగ్గాయి, మంచి నిద్ర, శక్తి వీటన్నిటితోపాటు, స్పష్టమైన ఆలోచన, మెరుగైన మానసిక ఆరోగ్యం కూడా లభించిందని చెప్పుకొచ్చాడు. 46 రోజుల్లో 11 కజీల బరువు తగ్గడం అనేది సాధారణ విషయం కాదు దీనికి ఎంతో పట్టుదల శ్రమ, ఉండాలి అంటున్నారు నెటిజన్లు. ఖరీదైన జిమ్‌లు, ట్రైనర్లు లేకుండానే సరైన సమాచారంతో ఇంట్లోనే ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చని కోడి క్రోన్ నిరూపించాడు. దీనికి సంబంధించి తన అనుభవాలను యూట్యూబ్ వీడియోల ద్వారా పంచుకుంటూ, ఇతరులకూ స్ఫూర్తినిస్తున్నాడునోట్‌: అంతర్లీనంగా మరేతర ఆరోగ్య సమస్యలు లేనపుడు బరువు తగ్గే విషయంలో అనుకున్న ఫలితాలు సాధించాలంటే ముందు నిబద్ధత అవసరం. పోషకాహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ, మంచి నిద్ర, రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తదితర సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే శారీరక ఆరోగ్యాన్ని పొందడం సాధ్యమే.

Chanda Kochhar found guilty in the Rs 64 cr Videocon bribe case9
చందా కొచ్చర్‌పై ఆరోపణలు.. నిజం బట్టబయలు

వీడియోకాన్ గ్రూపునకు రూ.300 కోట్ల రుణాన్ని మంజూరు చేసినందుకు ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్ రూ.64 కోట్లు లంచం తీసుకున్నట్లు తేలింది. అప్పిలేట్ ట్రిబ్యునల్ జులై 3న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించింది. వీడియోకాన్‌కు సంబంధించిన కంపెనీ ద్వారా చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ నుంచి ఈ డబ్బును తరలించినట్లు ట్రిబ్యునల్ తెలిపింది.ఈ చెల్లింపు క్విడ్ ప్రోకో(పరస్పర ప్రయోజనాలు) కేసు అని ట్రిబ్యునల్ పేర్కొంది. దాంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) కేసుకు బలం చేకూరింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్ 50 కింద నమోదైన డాక్యుమెంటరీ సాక్ష్యాలు, వాంగ్మూలాలను ఈడీ అందించిందని, వీటిని చట్టపరంగా ఆమోదించినట్లు అప్పిలేట్‌ తెలిపింది. రుణ ఆమోదం కోసం ఐసీఐసీఐ బ్యాంక్ అంతర్గత నిబంధనలను ఉల్లంఘించించారని ఇవి స్పష్టంగా చూపుతున్నట్లు పేర్కొంది.వీడియోకాన్ గ్రూప్ కంపెనీ ఎస్ఈపీఎల్ నుంచి దీపక్ కొచ్చర్ నేతృత్వంలోని నూపవర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఆర్పీఎల్)కు రూ.64 కోట్లు పంపినట్లు ట్రిబ్యునల్ వివరించింది. తర్వాతి రోజే వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.300 కోట్ల రుణాన్ని మంజూరు చేసినట్లు తేలింది. ఎన్ఆర్పీఎల్‌ యాజమాన్య బాధ్యతలు మొదట వీడియోకాన్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్ వద్ద ఉన్నట్లు చూపించినప్పటికీ, నిజమైన నియంత్రణ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన దీపక్ కొచ్చర్ వద్ద ఉందని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. రుణాన్ని ఆమోదించేటప్పుడు చందా కొచ్చర్ ఈ సంబంధాలను ప్రకటించనందున నేరానికి పాల్పడినట్లు స్పష్టమవుతుందని పేర్కొంది.ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..చందా కొచ్చర్, ఆమె కుటుంబానికి చెందిన అటాచ్ చేసిన ఆస్తులను విడుదల చేయడానికి అనుమతిస్తూ 2020 నవంబర్‌లో అడ్జుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన తీర్పును ట్రిబ్యునల్ తప్పుబట్టింది. ఆస్తులకు సంబంధించి తగిన ఆధారాలు లేవని అథారిటీ గుర్తించింది. కానీ ట్రిబ్యునల్ దీన్ని తీవ్రంగా విభేదించింది. అప్పటి అథారిటీ కీలక విషయాలను విస్మరించిందని పేర్కొంది. ‘న్యాయనిర్ణేత కీలకమైన భౌతిక వాస్తవాలను విస్మరించి, రికార్డులకు విరుద్ధంగా నిర్ధారణకు వచ్చింది. అందువల్ల, దాని ఫలితాలను మేము సమర్థించలేం’ అని ట్రిబ్యునల్ తెలిపింది.

Parliament Monsoon Session 23rd July 2025 Live Updates10
పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన.. ఉభయ సభలు వాయిదా

Parliament Monsoon Session Live Updates.. పార్లమెంట్‌లో వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమమయ్యాయి. ఈరోజు కూడా విపక్ష సభ్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదారాజ్యసభలో విపక్ష నేతల నిరసనల కారణంగా మరోసారి వాయిదాసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదాRajya Sabha adjourned till 2 pm following sloganeering by Opposition MPs demanding discussion on Special Intensive Revision of electoral rolls in Bihar pic.twitter.com/zORXTafwQD— ANI (@ANI) July 23, 2025కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కామెంట్స్‌..ఇండియా బ్లాక్ 'హుల్లాద్' బ్లాక్‌గా మారింది.పార్లమెంట్ వెలుపల చర్చ జరగాలని వారు అంటున్నారుకానీ సభలో చర్చకు రాకుండా పారిపోతున్నారు.నిన్న చేతులు జోడించి చర్చ జరగనివ్వమని నేను ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశాను.కానీ వారు హంగామా చేస్తూనే ఉన్నారు.రైతుల సంక్షేమం, సంబంధిత పథకాలకు సంబంధించి సభలో చాలా ప్రశ్నలు జాబితా చేయబడ్డాయి.ఇండియా బ్లాక్ ద్వంద్వ ప్రమాణాలను చూడాలని నేను రైతులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. #WATCH | Union Minister Shivraj Singh Chouhan says," INDIA bloc has become 'hullad' bloc...Outside the Parliament, they say, there should be discussion, but they are running away from debate in the House. Yesterday, with folded hands, I had appealed to the Opposition to let… pic.twitter.com/lrLCQNr7qA— ANI (@ANI) July 23, 2025లోక్‌సభ స్పీకర్‌తో బీజేపీ నేతల కీలక భేటీలోక్‌సభ ‍స్పీకర్‌ ఓం బిర్లాతో బీజేపీ నేతల కీలక భేటీ.స్పీకర్‌ను కలిసిన కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, కిరణ్‌ రిజుజు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కామెంట్స్‌..బీహార్‌లో ఓట్లను నిషేధించే పనిని ఎన్నికల సంఘం చేస్తోంది.ఇది ప్రధాని మోదీ, అమిత్ షా సమ్మతితో మాత్రమే జరుగుతోంది.ప్రధాని మోదీ చర్చల్లో పాల్గొనాలని మేము కోరుతున్నాం.ఆపరేషన్ సిందూర్, Special Intensive Revision (SIR) పై చర్చలు ఎప్పుడు జరుగుతాయో ఆయన మాకు తెలియజేయాలి.#WATCH | Delhi: Congress MP Gaurav Gogoi says, "Election Commission is doing the work of banning votes in Bihar. It can only be done with the consent of PM Modi and Union HM Amit Shah. We want PM Modi to participate in the discussions of SIR, and he should inform us when the… pic.twitter.com/DyqQRNDBZX— ANI (@ANI) July 23, 2025పార్లమెంటులో మూడో రోజూ ఆందోళనల పర్వంసభ సజావుగా సాగేలా సహకరించాలని ఎంపీలకు విజ్ఞప్తి చేసిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లావిపక్ష సభ్యుల నినాదాల మధ్యే కొనసాగిన ప్రశ్నోత్తరాలుమధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడిన ఉభయసభలు#WATCH | Lok Sabha adjourned till 12 noon amid sloganeering by the Opposition MPs.Speaker Om Birla says, "...This House is for discussion and dialogue, not for sloganeering. Maintain the decorum of the House..."(Source: Sansad TV) pic.twitter.com/HpaUPGknGb— ANI (@ANI) July 23, 2025పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళనఉభయ సభలు వాయిదా.. మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్‌సభ వాయిదా. మూడో రోజు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం.పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళనబీహార్ ఓటర్ ప్రత్యేక సవరణపై చర్చ జరపాలని కాంగ్రెస్, ఆర్జేడీ సహా విపక్షాల డిమాండ్పార్లమెంట్‌ బయట ఎంపీల నిరసనలునిరసనల్లో పాల్గొన్న రాహుల్‌ గాంధీ, అఖిలేష్‌ యాదవ్‌Lok Sabha session begins with Opposition MPs sloganeering Lok Sabha Speaker Om Birla urges the Opposition MPs to maintain decorum.House adjourned till 12 noon(Source: Sansad TV/ YouTube) pic.twitter.com/a0AwiBXZuw— ANI (@ANI) July 23, 2025 పార్లమెంట్‌ ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన.లోక్‌సభలో విపక్ష ఎంపీల నినాదాలు #WATCH | Delhi: Opposition MPs, including Lok Sabha LoP and Congress MP Rahul Gandhi, hold protest against ongoing Special Intensive Revision (SIR) of electoral rolls in Bihar, in Parliament. pic.twitter.com/Z4ZT2Z7jjY— ANI (@ANI) July 23, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement