వాస్తవానికి అద్దం పట్టేలా... | Dandupalya- 2 has finished 70 percent | Sakshi
Sakshi News home page

వాస్తవానికి అద్దం పట్టేలా...

Published Tue, May 17 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

వాస్తవానికి అద్దం పట్టేలా...

వాస్తవానికి అద్దం పట్టేలా...

నాలుగేళ్ల క్రితం రిలీజైన హిట్ చిత్రం ‘దండుపాళ్యం’. దానికి సీక్వెల్‌గా ‘దండుపాళ్యం-2’ రానున్న సంగతి తెలిసిందే. తెలుగు, కన్నడ భాషల్లో శ్రీనివాస రాజు దర్శకత్వంలో వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 70 శాతం పూర్తయింది. పూజా గాంధీ, రఘు ముఖర్జీ ముఖ్యతారలుగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబరులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘బెంగళూరు, బెల్గావ్‌లలో షూట్ జరిపాం. ‘దండుపాళ్యం’ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో వాస్తవానికి అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘జూన్, జూలైల్లో సిన్మా పూర్తి చేయనున్నాం. ఆగస్ట్‌లో విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు.
 

Advertisement

పోల్

Advertisement