తండ్రి లేఖను స్టేజ్‌ పై చదివిన హీరోయిన్‌ | Deepika Padukone reads out letter from father as her acceptance speech at Filmfare Awards | Sakshi
Sakshi News home page

తండ్రి లేఖను స్టేజ్‌ పై చదివిన హీరోయిన్‌

Published Sat, Jan 16 2016 5:33 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM

తండ్రి లేఖను స్టేజ్‌ పై చదివిన హీరోయిన్‌

తండ్రి లేఖను స్టేజ్‌ పై చదివిన హీరోయిన్‌

ముంబై : అందంతోపాటు అభినయంతో అభిమానుల మనసు దోచే బాలీవుడ్ సుందరి దీపికా పదుకొనే మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. పీకూ సినిమాలో కనబరిచిన నటనకు ఈ ఏడాది ఉత్తమ నటిగా దీపిక ఎంపికైన విషయం తెలిసిందే. ముంబైలో శుక్రవారం రాత్రి జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2016 కార్యక్రమంలో అవార్డు అందుకుంటున్న సమయంలో దీపిక చదివిన ఉత్తరం అతిథులచేత  మళ్లీ మళ్లీ చప్పట్లు కొట్టించింది.

సాధారణంగా నటులు అవార్డులు అందుకునే సమయంలో దర్శకులకు, నిర్మాతలకు, కుటుంబసభ్యులకు ధన్యవాదాలు చెప్పడం జరుగుతూనే ఉంటుంది. అయితే దీపిక మాత్రం తన తండ్రి ప్రకాష్ పదుకొనే కొన్ని సంవత్సరాల క్రితం తనకు రాసిన ఉత్తరాన్ని చదివి వినిపించి ఆహుతులచేత కంటతడి పెట్టించారు. 'నీవు చేస్తున్న పనిని నిజంగా నీవు ప్రేమిస్తున్నట్లైతే.. ఇక మరేదీ పెద్ద విషయం అనిపించదు.. అది అవార్డులైనా సరే. నీ మనసు ఏది చెప్తే అదే విను, నీ కలను నిజం చేస్కో. నువ్వు ముందు మా కూతురివి, ఆ తర్వాతే నటివి ' అంటూ తండ్రి నుంచి అందిన ప్రోత్సాహాన్ని ఉత్తరంలో చదివి వినిపిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు దీపిక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement