వరుస హిట్స్తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని, తన నెక్ట్స్ సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే మంచి మార్కెట్ సాధించిన ఈ యంగ్ హీరో సినిమాకు స్టార్ టెక్నీషియన్స్ యాడ్ అవుతున్నారు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన జెంటిల్మేన్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు నాని.
ఈ సినిమా రిలీజ్ తరువాత సినిమా చూపిస్తా మామ ఫేం త్రినాథ్ రావ్ దర్శకత్వంలో దిల్రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. నాని మంచి ఫాంలో ఉండటంతో పాటు దిల్రాజు బ్యానర్ సినిమా కావటంతో దేవీ కూడా వెంటనే ఒప్పేసుకున్నాడు. జెంటిల్మేన్ రిలీజ్ తరువాత ఈ సినిమాకు సంబందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం అవుతాయి.
నేచురల్ స్టార్తో రాక్ స్టార్
Published Thu, Jun 9 2016 11:49 AM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM
Advertisement
Advertisement