
దిల్ రాజు... దమ్ముంటే కాస్కో!
సిద్ధార్థ్‌కు తెలుగునాట క్రేజ్ తెచ్చిన సినిమా - ‘బొమ్మరిల్లు’. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం సిద్ధూ కెరీర్‌కి ఉపయోగపడింది. మరి.. ఆయన్ను దమ్ముంటే కాస్కో అని ఈ లవర్‌బోయ్ ఎందుకు అంటున్నారు? గత ఏడాది ఆయన నటించిన తమిళ చిత్రం ‘జిగర్ తండా’ ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి తెలుగులో ‘దిల్’ రాజు అని టైటిల్ పెట్టి, దమ్ముంటే కాస్కో అనేది ఉపశీర్షిక అట. మరి.. ఈ టైటిల్ ఎందుకు పెట్టారో? ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.