వరల్డ్ కప్‌తో భయం లేదు
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్‌కప్ క్రికెట్ ఫీవర్ సాగుతోంది. ముఖ్యం భారత్‌జట్టు వరుసగా రెండు సార్లు గెలిచి విజయపథంలో దూసుకుపోతుండడంతో వరల్డ్‌కప్ టోర్నీపై మరింత ఆసక్తి నెలకొంది. సరిగ్గా ఇలాంటి సమయంలో ఎనక్కుల్ ఒరువన్ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సిద్ధమవుతున్నారు ఆ చిత్ర యునిట్ . పైగా వరల్డ్ కప్‌పోటీల వల్ల తమకు ఎలాంటి భయం లేదంటున్నారు ఆ చిత్ర యూనిట్. ఈ విషయం గురించి చిత్ర హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ, కన్నడంలో విశేష విజయాన్ని సాధించిన లూషియా చిత్రానికి రీమేక్ ఈ చిత్రం అన్నారు. దీపా సన్నిధి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు శిష్యుడు ప్రసాద్ మర్రార్ దర్శకత్వం వహించారన్నారు.
విబిన్న కథా చిత్రాల్లో నటించాలన్న ఆకాంక్ష ఈ చిత్రంతో నెరవేరిందన్నారు. ఎనకుల్ ఒరువన్ చిత్రంలో తాను ద్విపాత్రాభినయం చేయడం కొత్త అనుభవంగా పేర్కొన్నారు. వీటిలో ఒక పాత్రను పల్లెటూరి యువకుడిగా నటించనున్నారు. అందానికి మించి బలమైన పాత్రగా ఇది ఉంటుందన్నారు. ప్రేక్షకులు ఆశించే అన్ని కమర్షియల్ అంచనాలతో ఎనకుల్ ఒరువన్ చిత్రం ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని మార్చి ఆరో తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. వరల్డ్ కప్ ఫీవర్ ప్రపంచం అంతా ఉన్నా, తమ చిత్రానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న నమ్మకాన్ని సిద్ధార్థ్ వ్యక్తంచేశారు.