
అక్కినేని వారసుడిగా నాగచైతన్యను జోష్ సినిమాతో దిల్‌రాజు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే ఆ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఎంతో మంది హీరోలకు హిట్‌లు ఇచ్చిన దిల్ రాజు మళ్లీ ఇన్నేళ్లకు చైతుకు కూడా సూపర్‌హిట్‌ను అందించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
దిల్ రాజు బ్యానర్‌లో ఓ కొత్త దర్శకుడితో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే చైతు ప్రస్తుతం మజిలీ, వెంకీ మామా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తైన వెంటనే దిల్ రాజు సినిమాను పట్టాలెక్కిస్తారని వినికిడి. ‘ఎఫ్2’ ఇచ్చిన బూస్ట్‌తో దిల్ రాజు చకచకా ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment