
దర్శకుడు, రచయిత రాజసింహా
రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రకు మాటలు రాసిన రచయిత రాజసింహా ముంబైలోని తన రూంలో ఆత్మహత్యాయత్నం చేశారు. కొంతకాలంగా అవకాశాలు లేక రాజసింహా డిప్రెషన్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఒక అమ్మాయి తప్ప సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాజసింహా, ఆ సినిమా ఆశించిన స‍్థాయిలో విజయం సాధించకపోవటంతో అవకాశాలు తగ్గాయి.
శంకర్‌దాదా ఎంబీబీయస్, బొమ‍్మరిల్లు, జుమ్మందినాధం, అనగనగా ఓ ధీరుడు, రుద్రమదేవి సినిమాలకు రాజసింహా రచయితగా పనిచేశారు. సంబరం, నీ స్నేహం, టక్కరిదొంగ లాంటి సినిమాల్లో నటుడిగానూ కనిపించారు. జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన పలు చిత్రాలకు సెకండ్‌యూనిట్ దర్శకుడిగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment