
నన్ను డమ్మీని చేశారు
పాపం నటి శ్రీయకు మాలీవుడ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఈ బ్యూటి ఇంతకుముందు కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా ప్రకాశించింది. చాలా అరుదైన భామలకు దక్కే రజనీకాంత్‌తో నటించే అవకాశాన్ని శివాజి చిత్రంతో సొంతం చేసుకున్న నటి శ్రీయ. అలాంటి నటిని కొందరు దర్శక నిర్మాతలు ఇప్పుడు చిన్న చూపుచూస్తున్నారు.
అంతగా అవకాశాలు లేని శ్రీయకు ఒక మలయాళ చిత్రం వెతుక్కుంటూ వచ్చింది. దానికి ఈ ముద్దుగుమ్మ కూడా ఓకే చెప్పేసింది. ఆ తర్వాత మరో హీరోయిన్ కూడా ఆ చిత్రంలో ఉంటుందని తెలిసినా అభ్యంతరం చెప్పలేదట.
అప్పటికే మలయాళంలో కొన్ని చిత్రాలు చేసిన నటి ఆండ్రియాను శ్రీయ సినిమాలో మరో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. మలయాళంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని ఆశిస్తున్న ఆండ్రియా అక్కడ యువ నటుడు షాహత్ ఫాజిల్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడడంతో ఆయన ప్రేమగోల భరించలేక మలయాళ చిత్రాలకే దూరమైంది.
ఇటీవల షాహిత్ ఫాజిల్, నటి నజ్రియా నజీమ్ ప్రేమ వివాహం ఖరారుకావడంతో ఆండ్రియా ఊపిరి పీల్చుకుంది. ఈ క్రమంలో తాజాగా ఒప్పుకున్న మలయాళ చిత్రంలో తన పాత్రకు ప్రాధాన్యం పెంచుకునే ప్రయత్నంలో ఆండ్రియా సఫలమైందట. ఇది శ్రీయకు అస్సలు నచ్చలేదట. దీంతో ఆ చిత్రం నుంచి వైదొలగిందట. దీని గురించి శ్రీయ మాట్లాడుతూ ఆండ్రియా పాత్రకు ప్రాధాన్యాన్ని పెంచి తన పాత్రను డమ్మీ చేశారని వాపోరుుంది. ఆమెకు అంత సీన్ ఉందా? అందుకే ఆ చిత్రాన్ని వదులుకున్నానని పేర్కొంది.