
సంతోష్ ప్రతాప్, అనమ్ ఖాని
సంతోష్ ప్రతాప్, అనమ్ ఖాని జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ద్వారం’. క్రాఫ్ట్‌మెన్ ఫిల్మ్ కార్పొరేషన్, పద్మశ్రీ క్రియేషన్స్, రాగె మూవీస్ పతాకాలపై ఆనంద్ చిత్రసేడు స్వీయదర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇచ్చారు.
దర్శకులు సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శక–నిర్మాత మాట్లాడుతూ– ‘‘సున్నితమైన ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఇది. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. మరో హీరోయిన్‌ని సెలక్ట్ చేయాల్సి ఉంది. హైదరాబాద్, వైజాగ్, అరకు, కేరళలో మూడు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment