మీరెవరు లిప్‌లాక్‌ పెట్టుకోవడం లేదా? నటి | Heroine Andrea acting in the Aval movie | Sakshi
Sakshi News home page

నిజజీవితంలో లిప్‌లాక్‌ పెట్టుకోవడం లేదా? నటి

Published Sat, Oct 28 2017 10:22 PM | Last Updated on Sat, Oct 28 2017 10:34 PM

Heroine Andrea acting in the Aval movie

వాస్తవానికి తాను చాలా భయస్తురాలు అంటున్నది సంచలన నటి. వివాదాస్పద పాత్రల్లో నటించడానికి మాత్రం చాలా ధైర్యంగా ముందుకొస్తుంది. ఈత దుస్తుల్లో, లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించడానికి ఏ మాత్రం వెనుకాడని నటి ఆండ్రియా. ఆమె నటించిన తాజా చిత్రం అవళ్‌. నవంబర్‌ 3న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. ఆండ్రియా హీరోయిన్‌గా దశాబ్దం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ అమ్మడి ముచ్చట్లు చూద్దాం. 

 మీరెందుకు మీడియాకు దూరంగా ఉంటారు? ఎప్పుడు మాట్లాడినా చాలా కోపంగా బదులిస్తుంటారనే ప్రచారంపై మీ సమాధానం?
మీడియాకు భేటీలు ఇచ్చే స్థాయికి నేనింకా ఎదగలేదు. పెద్దగా ఏమీ సాధించలేదని అనుకుంటున్నాను. ఇదే కారణం. అలాగని పూర్తిగా నేను పత్రికల వారిని పక్కన పెడుతున్నాననుకోకండి. విలేకరులెవరైనా కలిస్తే బదులిస్తూనే ఉన్నాను. అయితే హీరోయిన్‌ని ఎలాంటి ప్రశ్నలు అడగాలో అవే అడగాలి. ఇక కోపం అంటారా.. మనిషన్నాక కోపం వస్తుంది. నేనేదో అందరికి వ్యతిరేకినన్నట్లు ప్రశ్నలు వేస్తే కోపం రాదా? అయితే మునుపటి కంటే కోపం తగ్గి నాలో శాంతం పెరిగిందనే చెప్పాలి.

ఇటీవల మీరు పోషిస్తున్న పాత్రలన్నీ మిమ్మల్ని వేరే లెవల్‌కు తీసుకెళ్లేవిగా ఉంటున్నాయి. తరమణి చిత్రంలో మీ నటనకు పలువురి ప్రశంసలు లభించాయి. అయినా మీలో ఆ సంతోషకం కనిపించడంలేదే?
నిజమే నేను నటించిన పాత్రలను విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. తరమణి చిత్రం నా సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ నమ్మకంతోనే ఆ చిత్రం విడుదల కోసం నాలుగేళ్లు మరో చిత్రాన్ని అంగీకరించకుండా వేచి చూశాను. ఫలితం ఏమిటీ? ఆ తరువాత కొత్తగా అవకాశాలు వస్తాయని ఆశించిన నాకు నిరాశే మిగిలింది. అలాంటప్పుడు సంతోషం ఎలా కలుగుతుంది.

మీరు నటించిన తాజా చిత్రం అవళ్‌ ఎలా ఉంటుంది?
మీరు చూస్తున్న హాలీవుడ్‌ హారర్‌ చిత్రాల తరహాలో అవళ్‌ ఉంటుంది. ఇందులో సిద్ధార్ధ్‌  వైద్యుడిగా నటించారు. నేను ఆయనకు భార్యగా నటించాను. మంచు ప్రాంత నేపథ్యంలో జరిగే హారర్‌ కథా చిత్రం అవళ్‌.

ఈ చిత్రం టీజర్‌ నిడివి మొత్తం ముప్పావు నిమిషం ఉంటే అందులోనే నాలుగు లిప్‌లాక్‌ సన్నివేశాలు ఉన్నాయే?
లిప్‌లాక్‌ సన్నివేశాల గురించి మీడియానే ఇంకా విమర్శనాత్మకంగా చేస్తోంది. రోడ్డుపైకి వచ్చి చూడండి.. ఈ కాలం యువత ఇలాంటివన్నీ చాలా సహజంగా భావిస్తోంది. నిజ జీవితాలను ప్రతిభింబించే విధంగా ఇప్పుడు చాలా చిత్రాలు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే లిప్‌లాక్‌ అశ్లీలం, అసభ్యం అనే వారంతా నిజజీవితంలో వారు లిప్‌లాక్‌ ముద్దులు పెట్టుకోవడం లేదా? లిప్‌లాక్‌ సన్నివేశాలు ఉన్నాయనటం పాత పంచాంగం లాంటి ప్రశ్న.

నటుడు సిద్ధార్ధ్‌తో కలిసి నటించిన అనుభవం?
సిద్ధార్ధ్‌ చాలా జాలీ టైప్‌. కమలహాసన్‌ షూటింగ్‌ సెట్‌ తరువాత నేను చాలా కంఫర్ట్‌ ఫుల్‌ గా ఫీలయ్యింది ఈ చిత్ర సెట్‌లోనే.

 నటిగా, సింగర్‌గా రాణిస్తున్నారు.. దర్శకత్వం వహించే ఆలోచన ఉందా ?
నాకు తెలియని వృత్తిని ఎందుకు చేయాలి? సినిమాలో రెండు పనులు చేయడమే పెద్ద విషయం. చివరి వరకూ నటన, పాడటం చాలు. ఇతర పనులు
చేయడానికి ప్రతిభావంతులు చాలామంది ఉన్నారు.

నయనతార, అనుష్క, త్రిష వంటి నటీమణులు హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాలు చేస్తున్నారు. మీకు అలాంటి కోరిక లేదా?
నటించనని నేను చెప్పానా?  అలాంటి పాత్రలు అమిరితే నేనూ మంచి కథా పాత్రలను ఎంచుకుని నటిస్తాను.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement