సినిమాలోనూ సేమ్ పెళ్లి!
భలే కుదిరింది... పెళ్లికీ! సిన్మాకీ! తమిళ అయ్యంగార్ల ఫ్యామిలీలో పుట్టిన ప్రియమణి, ముస్లిమ్ వ్యక్తి ముస్తాఫారాజ్‌తో ప్రేమలో పడ్డారు. ఓ నెల క్రితం పెళ్లి చేసుకున్నారు కూడా. ‘ప్రియమణి ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు’ – అప్పట్లో ఈ లైన్ హెడ్‌లైన్స్‌కి ఎక్కింది. మళ్లీ సేమ్ హెడ్‌లైన్... ‘ప్రియమణి ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు’. చిన్న ట్విస్ట్ ఏంటంటే... రీల్ లైఫ్ మ్యారేజ్ ఇది! ప్రియమణి ‘ఆషిక్ వన్న దివసం’ అనే మలయాళ సిన్మా చేస్తున్నారు. ఆమె పెళ్లి తర్వాత విడుదల కానున్న తొలి చిత్రమిదే.
ఇందులో ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే అమ్మాయిగా నటిస్తున్నారామె. బహుశా... కొందరి నటీనటుల జీవితాల్లోనే ఇలా జరుగుతుందేమో? అని ప్రియమణిని అడిగితే... ‘ఓ.. నో! జస్ట్ కోయిన్సిడెన్సే. పెళ్లికి ముందు ఎప్పుడో దర్శకుడు క్రిష్ కైమల్ ఈ కథ చెప్పారు. అప్పుడే నేను నవ్వుకున్నా. అయితే... నా పెళ్లి తర్వాత విడుదలవుతోన్న సినిమా ఇదే కావడం అదృష్టం’’ అన్నారు. పెళ్లైన మూడో రోజే ప్రియమణి షూటింగులకు వెళ్లారట! ‘‘రిలేషన్‌షిప్ స్టేటస్ తప్ప మా లైఫ్‌లో పెద్దగా మార్పులేం లేవు. ఉండబోవనుకుంటున్నా. పెళ్లైన మూడో రోజే నేను వర్క్ (యాక్టింగ్) స్టార్ట్ చేశా’’ అని ప్రియమణి చెప్పుకొచ్చారు.