‘రాజమహల్’లో హారర్ | Horror movie Rajmahal shooting from 26th | Sakshi
Sakshi News home page

‘రాజమహల్’లో హారర్

Published Sat, Sep 21 2013 1:12 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

‘రాజమహల్’లో హారర్ - Sakshi

‘రాజమహల్’లో హారర్

సూర్యనాథ్, రియా, వందన, సౌమ్య ముఖ్య తారలుగా సన్ ఐ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘రాజమహల్’ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అప్పాజి కొండ దర్శకుడు. 
 
 తొలి సన్నివేశానికి గురుదత్ స్వామీజీ కెమెరా స్విచాన్ చేయగా, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు క్లాప్ ఇచ్చారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ -‘‘సెంటిమెంట్, రొమాన్స్ సమాహారంతో సాగే హారర్ మూవీ ఇది. ఈ 26న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. 
 
 హీరోగా తనకిది తొలి చిత్రమని సూర్యనాథ్ చెప్పారు. ఈ కథ బాగుందని, మంచి పాత్ర చేస్తున్నందుకు ఆనందంగా ఉందని సౌమ్య అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ యువన్, కెమెరా: జీఎల్ బాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement