మూడు రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు | 'Housefull 3' Mints Rs 100 Crore, Akshay Kumar Thanks Fans | Sakshi
Sakshi News home page

మూడు రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

Published Wed, Jun 8 2016 11:21 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

మూడు రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు - Sakshi

మూడు రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

ముంబై: బాలీవుడ్ చిత్రం 'హౌస్ఫుల్ 3' సినిమా తొలి మూడు రోజుల్లో 100 కోట్ల రూపాయల (గ్రాస్) వసూళ్లు సాధించింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషన్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. భారత్లో 73.02 కోట్లు, విదేశాల్లో 27.01 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు పేర్కొంది. ఘనవిజయం అందించిన అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ఈ సినిమా హీరో అక్షయ్ కుమార్ ట్వీట్ చేశాడు.

శుక్రవారం విడుదలైన ఈ కామెడీ సినిమాకు భిన్నమైన టాక్ వచ్చినా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. బాలీవుడ్ దర్శక ద్వయం సాజిద్‌-ఫర్హాద్‌ తాజా సినిమా 'హౌస్‌ఫుల్-3‌'లో అక్షయ్‌కుమార్, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, అభిషేక్‌ బచ్చన్‌ హీరోలుగా నటించారు. అక్షయ్, రితేశ్, అభిషేక్‌ లకు జోడీగా జాక్వలిన్ ఫెర్నాండెజ్‌, లిసా హేడన్‌, నర్గీస్‌ ఫక్రీ నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement