జాక్వలిన్కు హృతిక్ కానుక | hrithik Roshan helps Jacqueline | Sakshi
Sakshi News home page

జాక్వలిన్కు హృతిక్ కానుక

Published Sat, Mar 26 2016 10:32 AM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM

జాక్వలిన్కు హృతిక్ కానుక

జాక్వలిన్కు హృతిక్ కానుక

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలకు నడుం బిగించింది. ఇటీవల వరదలతో అతలాకుతలం అయిన చెన్నై నగరానికి తనవంతు సాయం అందించడానికి రెడీ అయ్యింది ఈ శ్రీలంక బ్యూటీ. అందులో భాగంగా వరదల్లో సర్వం కోల్పోయిన వారికి ఇళ్లను నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందుకోసం విరాళాలను సేకరించేందుకు రెడీ అయ్యింది.

ఈ కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు చెన్నై వచ్చిన జాక్వలిన్, ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, అక్కడ ప్రజల అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకుంది. జాక్వలిన్ చేస్తున్న కార్యక్రమాలకు సాయం అందించడానికి ముందుకు వచ్చాడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. అందులో భాగంగా తనవంతు సాయంగా జాక్వలిన్కు 5 లక్షల రూపాయిల చెక్ పంపించాడు.

హృతిక్ సాయంపై స్పందించిన జాక్వలిన్, ఇదే తనకు బెస్ట్ గిఫ్ట్ అంటూ ట్వీట్ చేసింది. తన ఆనందాన్ని తెలపటంతో పాటు హృతిక్ అందించిన చెక్ ఫోటోను కూడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మరి హృతిక్ బాటలో ఇంకెంత మంది నడుస్తారో చూడాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement