వాళ్లలా నేనుండలేను! | i can't be like them | Sakshi
Sakshi News home page

వాళ్లలా నేనుండలేను!

Published Wed, Sep 10 2014 12:37 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

వాళ్లలా నేనుండలేను! - Sakshi

వాళ్లలా నేనుండలేను!

మొదటి రెండుమూడు సినిమాలకే నటిగా సోనమ్ కపూర్ సత్తా ఏంటో జనానికి అర్థమైపోయింది. బాలీవుడ్ తెరకు ఓ మంచి నటి దొరికిందని అందరూ ఫిక్స్ అయిపోయారు. సావరియా, ఢిల్లీ-6, రాన్‌జనా, భాగ్ మిల్కా భాగ్ చిత్రాలు ఆమెకు బాలీవుడ్‌లో సముచిత స్థానాన్ని కట్టబెట్టాయి. కానీ... తన కెరీర్ పరంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సోనమ్ ఇటీవల ఓ సందర్భంలో మీడియాతో అన్నారు. ‘‘ ‘నీకు దక్కాల్సిన స్థానం దక్కలేదు’ అని చాలామంది దర్శకులు నాతో అంటుంటారు. నేను కూడా ఆ మాటకు ఏకీభవిస్తా. ఎందుకంటే, అందరు కథానాయికల్లాగా నేను ఉండలేను. చివరకు నేను ధరించే దుస్తులు కూడా నాలోని నటిని ప్రభావితం చేసేలా ఉండవ్. నాకు సరైన స్థానం దక్కకపోవడానికి ఈ స్వభావమే కారణం. అయితే... దేనికోసమో నా వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం నాకు నచ్చదు’’అని తేల్చి చెప్పేశారు సోనమ్. నటిగా విభిన్నమైన పాత్రలు పోషించాలనే కోరిక... అందుకు తగ్గ ప్రతిభ తనలో ఉన్నాయని, అయితే... దర్శక, నిర్మాతలకే ఆ విషయం అర్థం కావడంలేదనీ సోనమ్ వాపోయారు. ‘‘ప్రస్తుతం మా సొంత సంస్థలో నేను నటించిన ‘ఖూబ్‌సూరత్’ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఆ సినిమా విడుదల కోసం ఉత్కంఠగా ఎదురుచూసున్నా’’ అని చెప్పారు సోనమ్. 1980లో ప్రఖ్యాత దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖూబ్ సూరత్’ చిత్రానికి రీమేక్‌గా ఈ ‘ఖూబ్‌సూరత్’ని తెరకెక్కించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement