Hrishikesh Mukherjee
-
ఆ దర్శకుడి గరించి ఆసక్తికర విషయం చెప్పిన రేఖ
ఇండియన్ ఐడెల్ సీజన్ 12లో మొన్నటి శని, ఆదివారాల ఎపిసోడ్లను ప్రముఖ నటి రేఖ పేరిట డెడికేట్ చేశారు. ఈ షో అతిథిగా పాల్గొన్నా ఆమె తన పాటలు కంటెస్టెంట్లు పాడుతూ ఉంటే ఎంతో ఎంజాయ్ చేశారు. ఆ సినిమా, పాటల చిత్రీకరణ సమయంలోని అనుభవనాలను ఈ సందర్భంగా ఆమె పంచుకున్నారు. ఒక కంటెస్టెంట్ ‘ఉమ్రావ్ జాన్’లోని ‘ఏ క్యా జగా హై దోస్తో’ పాడుతూ ఉంటే ఆ పాట వెనుక కథ ఇలా వివరించారు. ‘పాటల్లో అభినయం తాను ప్రత్యేకంగా నేర్చుకోలేదని... లతా మంగేష్కర్, ఆశా భోంస్లే పాడేది వింటే ఎక్స్ప్రెషన్స్ వాటికవి వచ్చేస్తాయి’ అని ఆమె అన్నారు. గట్టి చలికాలంలో లక్నోలో ‘ఉమ్రాన్ జాన్’ చేస్తున్నప్పుడు ‘ఏ క్యా జగా హై దోస్తో’ పాట చిత్రీకరణకు గ్లిజరిన్ కంట్లో పెట్టుకుంటే అది గడ్డ కట్టిందా అనిపించిందని ఆమె అన్నారు. షాట్ ప్రకారం చెమర్చిన కళ్లతో పాడాల్సి ఉన్నా చలి వల్ల గ్లిజరిన్ పని చేయక కన్నీరు రాలేదని, కాని ఒక్కసారి నగారాలో పాట మొదలయ్యాక ఆశాభోంస్లే పాటకు హృదయం ద్రవించి కన్నీరు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ గురించి కూడా ఆమె ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.‘ఆయన కాస్ట్యూమ్స్‌కు ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టేవాడు కాదు. ‘ఖూబ్సూరత్’లో నేను నటించేటప్పుడు అది గమనించి ఇంటి దగ్గరి నుంచి మంచి మంచి డ్రస్సులు వేసుకొని వచ్చేదాన్ని. వాటిని ఆయన చూసి ఇవే బాగున్నాయి... వీటిలోనే నటించు అనేవాడు’ అని ఆమె గుర్తు చేసుకుంది. రేఖకు ఇప్పుడు 67 సంవత్సరాలు. కాని రెండు ఎపిసోడ్లలో ఆమె అద్భుతంగా డాన్సు చేసి ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. డోలక్ వాయిస్తున్నట్టు అభినయించింది. రేఖా ఎప్పటికీ రేఖానే అనిపించింది. -
హృషికేష్‌జీకి అంకితం చేస్తున్నా
తన తాజాచిత్రం‘ఖూబ్సూరత్’ను దివంగత నిర్మాత హృషికేష్ ముఖర్జీకి అంకితం చేస్తున్నానని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ పేర్కొంది. 1980లో హృషికేష్ ముఖర్జీ ‘ఖూబ్సూరత్’ సినిమా తీశారు. ఇప్పుడు అదే టైటిల్‌తో విడుదలైన సినిమాలో సోనమ్ నటించింది. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో పాకిస్థాన్ నటుడు ఫవద్‌ఖాన్ కథానాయకుడిగా నటించాడు. ‘ఈ సినిమాలో నాది ప్రధాన పాత్ర కాదు. ప్రతి సినిమాకి నిర్మాత, దర్శకుడు, రచయితలే కథానాయకులనేది నా భావన. ఏ సినిమా హిట్ అయినా ఆ గొప్పదనాన్ని నా ఖాతాలో వేసుకోను. ఒకవేళ బాక్సాఫీస్ వద్ద అది బోల్తాపడినా ఆ నింద నాపై మోపవద్దు. సినిమా అనేది ఉమ్మడి కృషి. అంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది’ అని అంది. ఈ సినిమా మీ సొంత బ్యానర్‌పై విడుదలైనందువల్ల ముందుజాగ్రత్తలేమైనా తీసుకున్నారా అని అడగ్గా ఒక వస్తువును మార్కెట్లోకి విడుదల చేసేముందు దానిపై మనకు సంపూర్ణ విశ్వాసముండాలంది. హృషికేశ్ ఇప్పటికీ బతికిఉండి ఈ సినిమా చూసినట్టయితే సంతోషించేవాడేమో కదా అని అడగ్గా ఒకవేళ ఆయన కనుక ఈ సినిమాను చూసినట్టయితే తనకు ఇబ్బందిగా అనిపించేదేమో అంది. హృషికేష్ తీసిన ఈ సినిమాని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని మీకు ఎందుకనిపించిందని ప్రశ్నించగా అందరినీ కడుపుబ్బా నవ్వించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశామని తెలిపింది. ఈ సినిమాని ఆ మహానుభావుడికే ఎంతో ప్రేమతో అంకితం చేస్తున్నానని చెప్పింది. మీ భవిష్య ప్రణాళికలేమిటని అడగ్గా ఈ నెల 21వ తేదీనుంచే ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమా షూటింగ్ ప్రారంభించామంది. తన సోదరి రేహా కూడా మరో సినిమా తీస్తోందని తెలిపింది. -
వాళ్లలా నేనుండలేను!
మొదటి రెండుమూడు సినిమాలకే నటిగా సోనమ్ కపూర్ సత్తా ఏంటో జనానికి అర్థమైపోయింది. బాలీవుడ్ తెరకు ఓ మంచి నటి దొరికిందని అందరూ ఫిక్స్ అయిపోయారు. సావరియా, ఢిల్లీ-6, రాన్‌జనా, భాగ్ మిల్కా భాగ్ చిత్రాలు ఆమెకు బాలీవుడ్లో సముచిత స్థానాన్ని కట్టబెట్టాయి. కానీ... తన కెరీర్ పరంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సోనమ్ ఇటీవల ఓ సందర్భంలో మీడియాతో అన్నారు. ‘‘ ‘నీకు దక్కాల్సిన స్థానం దక్కలేదు’ అని చాలామంది దర్శకులు నాతో అంటుంటారు. నేను కూడా ఆ మాటకు ఏకీభవిస్తా. ఎందుకంటే, అందరు కథానాయికల్లాగా నేను ఉండలేను. చివరకు నేను ధరించే దుస్తులు కూడా నాలోని నటిని ప్రభావితం చేసేలా ఉండవ్. నాకు సరైన స్థానం దక్కకపోవడానికి ఈ స్వభావమే కారణం. అయితే... దేనికోసమో నా వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం నాకు నచ్చదు’’అని తేల్చి చెప్పేశారు సోనమ్. నటిగా విభిన్నమైన పాత్రలు పోషించాలనే కోరిక... అందుకు తగ్గ ప్రతిభ తనలో ఉన్నాయని, అయితే... దర్శక, నిర్మాతలకే ఆ విషయం అర్థం కావడంలేదనీ సోనమ్ వాపోయారు. ‘‘ప్రస్తుతం మా సొంత సంస్థలో నేను నటించిన ‘ఖూబ్సూరత్’ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఆ సినిమా విడుదల కోసం ఉత్కంఠగా ఎదురుచూసున్నా’’ అని చెప్పారు సోనమ్. 1980లో ప్రఖ్యాత దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖూబ్ సూరత్’ చిత్రానికి రీమేక్‌గా ఈ ‘ఖూబ్సూరత్’ని తెరకెక్కించారు.