నా స్వార్థంతో ఈ సినిమా చేశా
‘‘నేనిప్పటి వరకూ పలు వైవిధ్యమైన పాత్రలు చేశా. ‘కథలో రాజకుమారి’ కథ రాసిన విధానం కొత్తగా ఉంది. లైన్ వినగానే ఎగ్జయిట్ అయ్యా. పదిహేను నిమిషాల పాత్ర కోసం గడ్డం కూడా పెంచా’’ అని హీరో నారా రోహిత్ అన్నారు. నారా రోహిత్, నాగశౌర్య, నమితా ప్రమోద్, నందిత ముఖ్య పాత్రల్లో మహేశ్ సూరపనేని దర్శకత్వంలో సౌందర్య నారా, ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మించిన ‘కథలో రాజకుమారి’ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. నారా రోహిత్ మాట్లాడుతూ – ‘‘నాగశౌర్య అడిగి మరీ ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటించాడు.
ఇళయరాజాగారు కొన్ని పాటలు కంపోజ్ చేశారు. విశాల్ కూడా మంచి మ్యూజిక్ అందించారు’’ అన్నారు. ‘‘న్యూ ఏజ్ ఎమోషన్‌లో సాగే ప్రేమకథా చిత్రమిది. పరుచూరి వెంకటేశ్వరరావుగారు మాకు స్క్రిప్ట్ విషయంలో సపోర్ట్ చేశారు’’ అన్నారు దర్శకుడు మహేశ్. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘జ్యో అచ్యుతానంద’ తర్వాత నేను, రోహిత్‌గారు కలిసి నటిస్తే బావుంటుందని ఈ సినిమాలో నేను కూడా నటిస్తానని చెప్పా. నా స్వార్థం కోసం ఈ సినిమా చేశా. అవుట్‌పుట్ చూసి హ్యాపీగా ఫీలయ్యా’’ అన్నారు.