'వాళ్లను' బ్లాక్ చేస్తాను : అనసూయ వార్నింగ్ | I will block like that people, tweets Anasuya Bharadwaj | Sakshi
Sakshi News home page

'వాళ్లను' బ్లాక్ చేస్తాను : అనసూయ వార్నింగ్

Published Sun, Nov 26 2017 5:35 PM | Last Updated on Sun, Nov 26 2017 6:17 PM

I will block like that people, tweets Anasuya Bharadwaj - Sakshi - Sakshi - Sakshi

హైదరాబాద్ : అసభ్యత, హాస్యం లాంటి విషయాల గురించి మాట్లాడితే అనవసరంగా పెడర్థాలు తీస్తున్నారంటూ స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మండిపడుతున్నారు. 'అసభ్యత, అశ్లీలత గురించి నేను ఏదైనా విషయం చెప్పినా, మాట్లాడినా.. బట్టలు సరిగా వేసుకోవాలంటారు. పోనీ కామెడీని కామెడీగా తీసుకుంటే మంచిదని చెబితే.. అర్జున్ రెడ్డి అంటారు. ఏందివయ్యా.. దిమాగ్ ల అటుది ఇటు.. ఇటుది అటు ఉందా' అంటూ ట్వీట్ చేశారు అనసూయ.

'పిచ్చి పిచ్చి రాతలు, కామెంట్స్, పోస్టులు చేసేవాళ్లను బ్లాక్ చేయడం ఉత్తమమని ఆమె భావిస్తున్నారు. 'సారీ.. ఏమనుకోవద్దు. వితండ వాదాలు చేసేవాళ్లని, బేసిక్‌గా నెగటివ్ సందేశాలు పంపేవాళ్లని బ్లాక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. నా సంతోషం నా చేతిలో అన్నట్లు. మీరు కూడా ఏది నచ్చితే అది చేయండి. నా చుట్టూ నిజాయితీ, నిబద్ధత, సంతోషంగా ఉండేవాళ్లు ఉంటే బాగుంటుందంటూ' మరో పోస్ట్‌లో ఈ స్టార్ యాంకర్ రాసుకొచ్చారు. 'హాస్యం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాం. స్క్రీన్ మీద ఆర్టిస్టులు చెప్పేది, చేసేది కేవలం కల్పితాలే. హాస్యం కోసం కొన్ని ప్రయోగాలు చేస్తుంటారు. ఎవరినీ ఉద్దేశించి అలాంటివి ఎవరూ చేయరు. భయట కూడా మేం నటిస్తున్నామని భావించవద్దంటూ' అనసూయ తన ట్వీట్ ద్వారా సూచించారు.

'ప్రతిదాన్ని భూతద్ధంలో చూస్తూ రియాక్ట్ అవుతున్నారు. మొన్న వాళ్లు (జబర్ధస్త్‌లో) చేసిన స్కిట్ అలాంటిది. వాళ్లంతా అనాథశ్రమానికి వెళతారు. అక్కడున్న వారిని ఉద్ధేశించి లీడ్ కోసం కొన్ని పదాలు అలా తీసుకున్నారు. వాటిని చూసి నవ్వుకోండి అంతే. మా ఉద్దేశ్యం నవ్వించడమే. లైఫ్‌లో వచ్చే అన్ని అంశాలను జబర్ధస్త్ కళ్లకి కట్టినట్లు చూపిస్తుందని' ఫేస్‌బుక్ వీడియోలో హైపర్ ఆది స్కిట్‌పై స్టార్ యాంకర్ అనసూయ స్పందించిన విషయం తెలిసిందే. ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్‌లో జబర్ధస్త్ హిస్టరీ చరిత్ర సృష్టించిందన్న అనసూయ.. కొందరు వ్యక్తులు పనిగట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement