
ఉద్యోగం పోతే...
ఆనందంగా జీవించే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం పోతుంది. అప్పుడు అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనే కథాంశంతో నిర్మించిన చిత్రం ‘ధనాధన్’. వైభవ్, రమ్యా నంబీశన్ జంటగా డా. శివ వై. ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని నిర్మించారు.
తమిళ స్టార్ డెరైక్టర్ శంకర్ శిష్యుడు శ్రీ దర్శకత్వం వహించారు. ‘‘ఇది కామెడీ థ్రిల్లర్. తమన్ మ్యూజిక్ హైలైట్’’ అని నిర్మాతలు చెప్పారు. కోట శ్రీనివాసరావు, షియాజీ షిండే తదితరులు నటించారు.