
థ్రిల్లింగ్ ఐస్
‘మోక్ష’ తర్వాత మీరా జాస్మిన్ మళ్లీ తెలుగు తెరపై కనబడలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ ఆమె నటించిన చిత్రం ‘ద ఐస్’. మలయాళంలో షాజియం తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో డి. వెంకటేశ్ అనువదించారు. శుక్రవారం ఈ చిత్రం విడుదల కానుంది.. ‘‘ఒక అమ్మాయికి ఎదురైన విచిత్రమైన అనుభవాల నేపథ్యంలో మంచి థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందింది. మీరాజాస్మిన్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఓ విభ్నిమైన పాయింట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రేక్షకులకు ఎక్కడా డబ్బింగ్ సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ కలగదు. మలయాళంలోలానే తెలుగులోనూ ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని డి. వెంకటేశ్ చెప్పారు.