
ముంబై : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ గురించి ఆసక్తికరమైన విషయాలను బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2014లో సల్మాన్ సరసన కిక్ మూవీలో ఆడిపాడిన జాక్వెలిన్ సల్లూభాయ్‌లో తాను ఓ విషయం గమనించానని, ఆయనకు అసలు విశ్రాంతి అంటే ఏంటో తెలియదని చెప్పుకొచ్చారు. సల్మాన్‌కు అసలు నిద్రించేందుకు సమయం ఉండదని, ఆయన ఉదయం..సాయంత్రం..రాత్రి పనిచేస్తూనే ఉంటారని, మూవీ షూటింగ్‌లోనో లేకుంటే బిగ్‌బాస్ సెట్‌లోనో..కాదంటే విమానాల్లో ప్రయాణిస్తూనో ఉంటారని అన్నారు. సల్మాన్‌జీ కొంచెం రెస్ట్ తీసుకోండి అంటూ జాక్వెలిన్ బాలీవుడ్ స్టార్‌కు సలహా ఇచ్చారు. సల్మాన్ జాక్వెలిన్‌లు కలిసి కిక్, రేస్ 3 వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం సల్మాన్, జాక్వెలిన్‌లు ఇద్దరూ వారి సినిమా, వెబ్‌సిరీస్‌ల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment