బిగ్‌బాస్‌ నుంచి జాఫర్‌ ఔట్‌..ఎందుకంటే.. | Jaffar Eliminated From Bigg Boss 3! | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ నుంచి జాఫర్‌ ఔట్‌!

Published Sun, Aug 4 2019 12:04 PM | Last Updated on Sun, Aug 4 2019 12:39 PM

Jaffar Eliminated From Bigg Boss 3! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు బుల్లితెరపై ఆసక్తికరంగా సాగుతున్న బిగ్‌బాస్‌ 3 షోలో రెండో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. వారాంతం ఎలిమినేషన్‌కు కింగ్‌ నాగార్జున సిద్ధం కాగా, ఎవరు ఎలిమినేట్‌ అవుతారనే విషయంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వారం ఎనిమిది మందిపై (మహేష్‌, హిమజ, రాహుల్‌, శ్రీముఖి, వరుణ్‌ సందేశ్‌, వితికా షెరు, జాఫర్‌, పునర్నవి) ఎలిమినేషన్‌ కత్తి వేలాడగా.. దాంట్లో నుంచి శనివారం మహేష్‌, హిమజ, రాహుల్‌, శ్రీముఖి సేఫ్‌ జోన్‌లో పడ్డారు. ఇక మిగిలిన నలుగురిలో వరుణ్‌ సందేశ్‌, వితికా షేరు, జాఫర్‌, పునర్నవి ఉన్నారు.

దీంతో ఈ వారం ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతారనే అంశం మరింత ఆసక్తిగా మారింది. అయితే ఇప్పటికే లీకైన సమాచారం మేరకు జాఫర్‌ ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది. వితికా షెరు బయటకు వెళ్తుందనే ప్రచారం జరిగినా.. శనివారం సాయంత్రం నుంచి జాఫర్‌ ఎలిమినేట్‌ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్‌ ఇంట్లో జాఫర్‌ ఫెర్ఫామెన్స్‌ పెద్దగా లేదని, అందుకే ఆయన ఈ వారం ఎలిమినేట్‌ అవుతారనే వార్త బలంగా వినిపిస్తోంది. సోషల్‌ మీడియాలో సైతం జాఫర్‌ ఎలిమినేట్‌ అయ్యారన్న వార్త హల్‌చల్‌ చేస్తోంది. 

(చదవండి : బిగ్‌బాస్‌ హౌస్‌లో హీరో, విలన్లు ఎవరంటే..?)

బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వెళ్లినప్పటి నుంచి జాఫర్‌ అందరితో కలిసి సరదాగా ఉండడం లేదనే అభిప్రాయం ప్రేక్షకులను నుంచి వ్యక్తమవుతుంది. అంతేకాకుండా బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లను కూడా సరిగా పూర్తి చేయలేదు. కేవలం బాబా భాస్కర్‌తోనే సరదాగా ఉంటున్నారు. జాఫర్‌ను అందరూ గౌరవిస్తున్నా సరే అతను అక్కడ ఇముడలేకపోతున్నారు. ఎప్పుడేప్పుడు హౌజ్‌ నుంచి బయటపడదామా అని ఎదురు చూస్తున్నారు. తనకు ఈ షో అంతగా సెట్‌ కాదని మొదటి వారం నుంచి చెప్పుకొస్తున్నారు. అవకాశం ఉంటే తననే ఎలిమినేషన్‌కు నామినేట్‌ చేయమని హౌజ్‌మేట్స్‌ను వేడుకున్నారు.

అయితే రెండో వారం ఆయన కాస్త అందరితో కలిసి సరదాగా ఉన్నా.. బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ను మాత్రం చేయలేకపోతున్నారు. అలాంటి టాస్క్‌ చేస్తే తన స్టేటస్‌ తగ్గిపోతుందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిసారి బాబా భాస్కర్‌తోనే ఎక్కువగా మూవ్‌ అవుతున్నారు. మిగతావారితో ఎలాంటి గొడవలు పెట్టుకోనప్పటికీ వారితో అంత క్లోజ్‌గా ఉండలేక పోతున్నారు.  వీటి కారణంగానే ఈ వారం జాఫర్‌ ఎలిమినేట్‌ అవుతారని తెలుస్తోంది. హౌజ్‌లో ఉన్నవారు జాఫర్‌కు మద్దతు పలికినా సరే ఈ వారం జాఫర్‌కు ఇంటి నుంచి బయటపడడం దాదాపు ఖాయమైపోయిందని సమాచారం. ఓట్ల పరంగా వితిక ఎలిమినేట్‌ అయినప్పటీకీ, టీఆర్పీ ప్రకారం జాఫర్‌ను ఎలిమినేట్‌  చేస్తారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి సోషల్‌ మీడియా విశ్లేషణ ప్రకారం జాఫర్‌ ఎలిమినేట్‌ అయ్యాడా? లేక వితికా ఎలిమినేట్‌ అయ్యిందా తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement