వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీముఖి, బాబా భాస్కర్‌ | Bigg Boss 3 Telugu Jaffar Eliminated In Second Week | Sakshi
Sakshi News home page

వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీముఖి, బాబా భాస్కర్‌

Published Sun, Aug 4 2019 10:56 PM | Last Updated on Mon, Aug 5 2019 3:52 PM

Bigg Boss 3 Telugu Jaffar Eliminated In Second Week - Sakshi

ఫ్రెండ్‌ షిప్‌డే సెలబ్రేషన్స్‌తో హౌస్‌ అంతా సందడిగా గడిచింది. కానీ జాఫర్‌ ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించిన తరువాత ఇంటి సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీముఖి మాత్రం వెక్కి వెక్కి ఏడ్వగా.. బాబా భాస్కర్‌ బాధను ఆపుకోలేక కన్నీరు కారుస్తుంటే మిగతా హౌస్‌మేట్స్‌ ఓదార్చారు. ఫ్రెండ్‌ షిప్‌ గేమ్‌ ఆడించడం, ఇస్మార్ట్‌ టీమ్‌ సినిమా పేర్లు చెబుతూ ఉంటే.. హౌస్‌మేట్స్‌కు ఆ బ్యాడ్జీలను తగిలించడం అంతా సరదాగా సాగిపోయింది. చివర్లో జాఫర్‌ చేసిన ముఖాముఖి కూడా బాగానే ఆకట్టుకుంది. (చదవండి: ఫ్రెండ్‌షిప్‌ రోజే.. ఫ్రెండ్స్‌ విడిపోయారు!)

ఫ్రెండ్‌ షిప్‌ డే సందర్భంగా.. హౌస్‌మేట్స్‌ తమ బెస్ట్‌ ఫ్రెండ్‌కు ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌లను కట్టారు. మొదటగా శ్రీముఖి బాబా భాస్కర్‌కు కట్టగా.. అనంతరం హిమజ.. మహేష్‌కు, జాఫర్‌.. రోహిణికి, బాబా భాస్కర్‌.. జాఫర్‌కు, రవికృష్ణ.. అలిరెజాకు, మహేష్‌.. అషూరెడ్డికు, వరుణ్‌ సందేశ్‌..రాహుల్‌కు, వితికా.. పునర్నవికి, శివజ్యోతి.. హిమజకు, తమన్నా-శ్రీముఖికి, పునర్నవి.. వితికాకు, రోహిణి.. తమన్నాకు, అలీరెజా.. రవికృష్ణకు, అషూ.. జ్యోతి, రాహుల్‌.. వరుణ్‌లకు కట్టారు. అనంతరం ఆ ఫ్రెండ్‌ షిప్‌ బ్యాండ్‌ కట్టడానికి, ఆ కంటెస్టెంటే ఎందుకు బెస్ట్‌ ఫ్రెండ్‌ అయ్యారనే దానికి కారణాలను వివరించారు.

ఇక ఫ్రెండ్‌షిప్‌ డే సెలబ్రేషన్స్‌ అయిన తరువాత.. ఇస్మార్ట్‌ శంకర్‌ టీమ్‌ అతిథులుగా విచ్చేశారు. రామ్‌, నిధి అగర్వాల్‌ ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్‌తో కలిసి సందడి చేశారు. హౌస్‌మేట్స్‌, గెస్ట్‌లతో కలిపి నాగ్‌ ఓ ఆట ఆడించాడు. రామ్‌, నిధి.. సినిమా పేర్లు చెబుతూ ఉంటే.. అవి ఎవరికి సెట్‌ అవుతాయో చెప్పి బ్యాడ్జ్‌లను పెట్టాలని హౌస్‌మేట్స్‌కు తెలిపాడు. ఈ క్రమంలో అలీ రెజాకు ఇస్మార్ట్‌ శంకర్‌.. వితికా షెరుకు బ్లఫ్‌ మాస్టర్‌.. శ్రీముఖికి దేశముదురు, పోకిరి.. రాహుల్‌కు దొంగోడు, గోపి గోడ మీద పిల్లి.. రోహిణికి అర్జున్‌ రెడ్డి.. బాబా భాస్కర్‌కు సరైనోడు, రోబో.. తమన్నాకు ఊసరవెళ్లి, జులాయి, కంత్రి.. వరుణ్‌కు డిక్టేటర్‌.. పునర్నవికి మహానటి.. హిమజకు సుడిగాడు అనే ట్యాగ్‌లైన్లు ఇచ్చారు. అనంతరం ఇస్మార్ట్‌ శంకర్‌ సాంగ్‌కు రామ్‌, నిధితో కలిసి హౌస్‌మేట్స్‌ స్టెప్పులు వేశారు.

అనంతరం పునర్నవి, వరుణ్‌ సందేశ్‌లు సేఫ్‌ అని ప్రకటించగా.. వితిక, జాఫర్‌ ఇద్దరు మిగిలారు. అయితే ఈ ఇద్దరిలో హౌస్‌మేట్స్‌ ఎవరికి ఓటు వేస్తారని నాగ్‌ అడగ్గా.. వితికాకు ఆరుగురు, జాఫర్‌కు ఏడుగురు సపోర్ట్‌ చేశారు. అయితే జాఫర్‌ ఎలిమినేట్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు రావాల్సిందిగా బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఇక జాఫర్‌ ఎలిమినేట్‌ అయి వెళ్లే సమయంలో శ్రీముఖి వెక్కి వెక్కి ఏడ్చింది. బాబా భాస్కర్‌ సైతం కన్నీళ్లును ఆపుకోలేకపోయాడు. వెళ్తూ వెళ్తూ .. బాబా భాస్కర్‌ను అలా అనొద్దంటూ (మైండ్‌ గేమ్‌తో ఆడుతున్నాడు) వరుణ్‌ను హెచ్చరించాడు.

బయటకు వచ్చిన జాఫర్‌.. బిగ్‌బాస్‌ గురించి తన అభిప్రాయాలను చెప్పుకొచ్చాడు. మొదట్లో ఇదంగా స్క్రిప్ట్‌ అని అనుకున్నట్లు, కానీ అందులో వచ్చినవి రియల్‌ ఎమోషన్స్‌ అని తెలిపాడు. ఇక హౌస్‌మేట్స్‌తో జాఫర్‌ ముఖాముఖి నిర్వహించాడు.

జాఫర్‌ : మహేష్‌.. నిజంగా ముక్కోపా కాదా? 
మహేష్‌.. కాదు
జాఫర్‌ : బాబా భాస్కర్‌.. మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?
బాబా భాస్కర్‌.. ఎవరు ఎలా అనుకుంటే అలా
జాఫర్‌ : శ్రీముఖికి హౌజ్‌లో వితికా ఫ్రెండా? శత్రువా?
శ్రీముఖి.. ఫ్రెండ్‌
జాఫర్‌ : ఈ హౌస్‌లోకి ఎందుకు వచ్చావు?
తమన్నా.. ట్రాన్స్‌జెండర్‌లో కూడా మంచోళ్లు ఉన్నారని చెప్పడానికి
జాఫర్‌ : తమన్నా అభిప్రాయంతో ఏకిభవిస్తున్నారా?
అలీ.. అవును
జాఫర్‌ : మంచోళ్లు అని అనుకోవాలని ప్రయత్నిస్తున్నావా?
రవి కృష్ణ.. నేను బయటెలా ఉన్నానో లోపల కూడా అలానే ఉన్నాను
జాఫర్‌ : అందరితో కలిసి ఉండటమే స్ట్రాటజీనా?
రోహిణి.. కాదు
జాఫర్‌ : అందరితో మంచిగా ఉండటమే ప్లానా?
అషూ రెడ్డి.. కాదు
జాఫర్‌ : ఫీమేల్‌ కంటెస్టెంట్లు హోల్‌ హార్టెడ్‌గా యాక్సెప్ట్‌ చేశారా?
హిమజ.. మేల్‌ కంటెస్టెంట్లు కూడా యాక్సెప్ట్‌ చేశారు. 
జాఫర్‌ : ఎమోషన్‌ డామినేషన్‌ చేస్తోందా?
శివజ్యోతి.. ఫిజికల్లీ స్ట్రాంగ్‌గానే ఉంటాను..
జాఫర్‌ : అందరితో కలవడం లేదు.. గ్రూప్‌తోనే ఉంటున్నావు?
పునర్నవి.. నేను ఎప్పుడూ అలా అనుకోలేదు
జాఫర్‌ : ఓ గ్రూప్‌కు వరుణ్‌ నాయకత్వం వహిస్తున్నాడా?
వితికా.. కాదు
జాఫర్‌ : నీకు కొంచెం ఫ్రస్ట్రేషన్‌ ఉందన్నావు.. నీపై హౌస్‌మేట్స్‌కు దురభిప్రాయం ఉందా?
వరుణ్‌ సందేశ్‌.. లేదు
జాఫర్‌ : వరుణ్‌ గ్రూప్‌లో వైస్‌ కెప్టెన్‌?
రాహుల్‌.. ఎవరికి ఎలా అనిపిస్తే అలా

అనంతరం జాఫర్‌ బిగ్‌బాస్‌ను వదిలి వెళ్లిపోయాడు. అనుకున్నట్లే.. ప్రచారం జరిగినట్టే.. జాఫర్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. శనివారం సాయంత్రం నుంచే జాఫర్‌ ఎలిమినేట్‌ అయినట్లు ప్రచారం జరగ్గా.. ఆదివారం ఉదయానికి ఆ వార్త మరింత ఊపందుకుంది. సోషల్‌ మీడియాలో లీకులకు బిగ్‌బాస్‌ అడ్డుకట్ట వేయలేకపోతున్నాడు. అయితే మొదట్నుంచీ వితికా ఎలిమినేట్‌ అవుతుందని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా జాఫర్‌ తెరపైకి వచ్చి.. రెండో వారంలో ఇంటి బాట పట్టాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లో గ్రూపులు బాగానే పెరిగిపోయాయన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ గ్రూపుల గొడవలు ఎంత వరకు దారి తీస్తాయో చూడాలి.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement