బిగ్‌బాస్‌ హౌస్‌లో హీరో, విలన్లు ఎవరంటే..? | Bigg Boss 3 Telugu Hero And Villain Game | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ హౌస్‌లో హీరో, విలన్లు ఎవరంటే..?

Published Sat, Aug 3 2019 11:01 PM | Last Updated on Sun, Aug 4 2019 10:59 AM

Bigg Boss 3 Telugu Hero And Villain Game - Sakshi

బిగ్‌బాస్‌ను నాలుగున్నర కోట్ల మంది వీక్షిస్తున్నారంటూ.. బిగ్గర్‌దెన్‌ బిగ్గెస్ట్‌ అంటూ బిగ్‌బాస్‌ షో గురించి కింగ్‌ నాగార్జున చెప్పుకొచ్చారు. తమను నాలుగున్నర కోట్ల మంది గమనిస్తున్నారని, జాగ్రత్తగా ఉండమని  హౌస్‌మేట్స్‌కు సూచించాడు. హీరో-విలన్‌ గేమ్‌ అంటూ ఇంటిసభ్యులను ఆట ఆడించిన నాగ్‌.. ఇంటి సభ్యులందరి వ్యవహారాలను చక్కబెట్టాడు. మొదటి వారంలో వదిలేసిన వరుణ్‌ సందేశ్‌-మహేష్‌ గొడవను ప్రస్తావించాడు. బిగ్‌బాస్‌ ఇంట్లో ఎక్కడికక్కడ గ్రూపులు ఏర్పడ్డాయని నాగ్‌ తెలిపాడు. శ్రీముఖి, జాఫర్‌, తమన్నాలు.. వరుణ్‌ సందేశ్‌, వితికాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే.. బయట ఉన్న వరుణ్‌ రవికృష్ణతో శ్రీముఖి గురించి చర్చిస్తూ ఉన్నాడు. జాఫర్‌, బాబా భాస్కర్‌లతో వరుణ్‌ సందేశ్‌ గురించి మహేష్‌ కామెంట్‌ చేస్తూ ఉన్నాడు. సెకండ్‌సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లందర్నీ వరుణ్‌ కలిశాడని, గేమ్‌ ఎలా ఆడాలని తెలుసుకున్నాడంటూ జాఫర్‌, బాబా భాస్కర్‌లతో మహేష్‌ చెప్పుకొచ్చాడు. జైల్లో ఉన్న కారణంగా తమన్నాతో ఒక ఓటు వేయించుకుంటున్నాడంటూ కామెంట్‌ చేశాడు. ఇక వీటన్నంటిని గమనిస్తున్న నాగ్‌.. ఇంట్లో కొత్త కొత్త ట్రాకులు, గ్రూపులు పెరిగాయంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.

ఇక ఒక్కొక్కరి లెక్క తేలుస్తూ.. ఇంటి సభ్యులందరి వ్యవహారాలను టచ్‌ చేశాడు. మొదటగా శివజ్యోతి నుంచి మొదలుపెట్టగా.. పవర్‌ గేమ్‌లో కింద పడినా.. స్పోర్టివ్‌గా తీసుకోవడం అలీ రెజాకు కిరీటాన్ని పెట్టడాన్ని అభినందించాడు. ఇంట్లో బాగా ఏడుస్తుందని.. బయట వర్షాలు బాగా పడుతున్నాయని, చెరువులు నిండుతున్నాయని ఏడ్వొద్దని సరదాగా కామెంట్‌ చేశాడు. ఇక పవర్‌ గేమ్‌ వ్యవహారంలో, తమన్నా గొడవపెట్టుకోవాలని చూసినా.. సామరస్యపూర్వకంగా చక్కదిద్దడంపై అలీ రెజాను పొగిడాడు. అలీ రెజా విషయంలో తమన్నాను మందలిస్తూ.. అందరితో మంచిగా ఉండేందుకు ప్రయత్నించమని ఆమెకు సలహా ఇచ్చాడు. తమన్నా ఆటపట్టించినా సరదగా తీసుకోవడం.. వితికాను ఓదార్చే విషయంలో రవికృష్ణను పొగిడాడు. వితికా-వరుణ్‌ సందేశ్‌ గొడవ గురించి మాట్లాడుతూ.. తన భర్తే తనకు సపోర్ట్‌ చేయలేదని ఎమోషనల్‌ అయిందని.. భర్త భార్యను సపోర్టు చేయాలని వరుణ్‌తో చెప్పుకొచ్చాడు. మొదటివారంలో జరిగిన మహేష్‌-వరుణ్‌ గొడవ గురించి మాట్లాడుతూ.. మహేష్‌తో వరుణ్‌ ప్రవర్తించిన తీరు నచ్చలేదని తెలిపాడు. సీమ నుంచి వచ్చినోళ్లు నాటు కాదు.. సిటీ నుంచి వచ్చినోళ్లు నీటు కాదంటూ తెలిపాడు.

బాబా భాస్కర్ హీరో.. వరుణ్‌ సందేశ్‌, తమన్నాలు విలన్లు
ఇంటిసభ్యులందరితో హీరో-విలన్‌ గేమ ఆడించాడు నాగ్‌. బంగారు వర్ణంలో ఉన్న కిరీటాన్ని హీరో అని భావించే ఇంటి సభ్యుడికి, నలుపు వర్ణంలో ఉన్న కిరీటాన్ని విలన్‌ అని భావించే హౌస్‌మేట్స్‌కు పెట్టాలని ఓ ఆటను ఆడించాడు. ఈ ఆటలో ఎక్కువ బంగారు కిరీటాలు బాబా భాస్కర్‌కు రాగా.. వరుణ్‌ సందేశ్‌, తమన్నాలకు విలన్‌కు సంబంధించిన కిరిటం తొడిగారు. శివజ్యోతి, అషూ, రోహిణిలు బాబా బాస్కర్‌కు బంగారు కిరీటం తొడగ్గా.. వరుణ్‌, రాహుల్‌, తమన్నాలకు నలుపు వర్ణం కిరీటం పెట్టారు. అలీ రెజాకు విలన్‌ కిరీటం.. రవికృష్ణకు హీరో కిరీటాన్ని తమన్నా తొడిగింది. జాఫర్‌.. వరుణ్‌కు విలన్‌, శ్రీముఖికి హీరో కిరీటాన్ని తొడిగాడు. శ్రీముఖి.. జాఫర్‌కు హీరో, వరుణ్‌కు విలన్‌ కిరీటాన్ని పెట్టారు.

రాహుల్‌.. రోహిణికి హీరో, శ్రీముఖికి విలన్‌ కిరీటాన్ని పెట్టారు. అలీ రెజాకు హీరో, తమన్నాకు విలన్‌ కిరీటాన్ని హిమజ తొడిగింది. రవికృష్ణకు హీరో, శివజ్యోతికి విలన్‌ కిరీటాన్ని వరుణ్‌ సందేశ్‌ పెట్టాడు. పునర్నవి.. తమన్నాకు హీరో, మహేష్‌కు విలన్‌ కిరీటాన్ని తొడిగింది. శివజ్యోతిని బిగ్‌బాస్‌ ఇచ్చిన సోదరిగా చెప్పుకొచి​.. ఆమెకు హీరోకు సంబంధించిన కిరీటాన్ని, తమన్నాకు విలన్‌ కిరీటాన్ని అలీ రెజా తొడిగాడు. వరుణ్‌కు హీరో, రాహుల్‌కు విలన్‌ కిరీటాన్ని వితిక పెట్టారు. వితికాకు విలన్‌, రోహిణికి హీరో కిరీటాన్ని బాబా భాస్కర్‌ తొడిగాడు. తమన్నాకు హీరో, వరుణ్‌కు విలన్‌ కిరీటాన్ని మహేష్‌ పెట్టాడు. ఈ ఆటలో బాబా భాస్కర్‌ హీరో.. తమన్నా, వరుణ్‌ సందేశ్‌లు విలన్స్‌ అని ఇంటిసభ్యులు తేల్చేశారు. 

ఇక ఎలిమినేషన్‌లో ఉన్న ఇంటిసభ్యులందరిలో మహేష్‌, హిమజ, రాహుల్‌, శ్రీముఖి సేఫ్‌.. అయినట్లు నాగ్‌ ప్రకటించాడు. ఇక మిగిలిన ఇంటిసభ్యులు వరుణ్‌ సందేశ్‌, వితికా షెరు, జాఫర్‌, పునర్నవిల్లోంచి ఎవరు ఎలిమినేట్‌ కానున్నారో చూడాలి. ఇప్పటికే లీకైన సమాచారం మేరకు జాఫర్‌ ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది. వితికా షెరు బయటకు వెళ్తుందనే ప్రచారం జరిగినా.. శనివారం సాయంత్రం నుంచి జాఫర్‌ ఎలిమినేట్‌ అయినట్లు వార్తలు వినిపించాయి. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లోంచి జాఫర్‌ ఎలిమినేట్‌ అయినట్లు సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సోషల్‌ మీడియా విశ్లేషణ ప్రకారం జాఫర్‌ ఎలిమినేట్‌ అయ్యాడా? లేక వితికా ఎలిమినేట్‌ అయ్యిందా తెలుసుకోవాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్‌ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement