
బిగ్‌బాస్ ఇంట్లో సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. వరుణ్, వితిక, శివజ్యోతిల గొడవ దెబ్బతో అందరూ నామినేషన్‌లోకి వచ్చారు. దీంతో ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్ అనేది తేలనుంది. ఇక ఇంటి సభ్యుల కష్టానికి ఏమాత్రం తీసిపోకుండా వారి అభిమానులు కూడా తమతమ ఫేవరెట్ కంటెస్టెంట్లను ఎలిమినేషన్ నుంచి గట్టెక్కించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇకపోతే బిగ్‌బాస్ ఈ వారం ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాడు. మొదట నామినేషన్ ప్రక్రియతో అందరినీ డేంజర్ జోన్‌లోకి పంపించి ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చాడు. అనంతరం వారి కుటుంబ సభ్యులను హౌస్‌లోకి పంపించి ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో అదిరిపోయే ట్విస్టు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు సభ్యులు మిగిలారు. ఇప్పటికే వైల్డ్‌కార్డ్ కార్డ్ ఎంట్రీలు అయిపోయాయి. మిగిలిందల్లా డబుల్ ఎలిమినేషన్! తాజా ప్రోమో ప్రకారం నాగ్ చెప్పినట్టుగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా..! ఉంటే కనక హౌస్ నుంచి వితికతో పాటు శివజ్యోతి తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా! అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపేమో.. ఎలిమినేట్ అయింది వితిక మాత్రమే అంటూ లీకువీరులు దరువేసి మరీ చెప్తున్నారు. మరి ఈ వారం వితిక వెళ్లిపోతే వరుణ్ ఏమవుతాడో చూడాలి! భార్యను వెయ్యి ఏనుగుల బలంగా భావించే వరుణ్ తను వెళ్లిపోతే కుప్పకూలిపోతాడా.. రెట్టింపు కష్టపడుతూ టైటిల్ దక్కించుకోడానికి ప్రయత్నిస్తాడా అనేది చూడాలి!
Sunday ochesindi so its Funday time!!! kani last lo twist emana untunda ??#BiggBossTelugu3 Today at 9 PM on @StarMaa pic.twitter.com/JYLUSDDvFJ
— STAR MAA (@StarMaa) October 20, 2019
Comments
Please login to add a commentAdd a comment