వితిక చేసిన పనికి షాకయిన నాగార్జున! | Bigg Boss 3 Telugu Vithika Won The Medal | Sakshi
Sakshi News home page

వితిక చేసిన పనికి షాకయిన నాగార్జున!

Published Sat, Oct 5 2019 6:07 PM | Last Updated on Mon, Oct 7 2019 3:36 PM

Bigg Boss 3 Telugu Vithika Won The Medal - Sakshi

బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్ కోసం ఇంటిసభ్యులు హోరాహోరీగా పోరాడారు. మొదటి లెవల్లో గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన వితిక, రెండో లెవల్లో విజయం సాధించిన బాబా భాస్కర్ మెడల్ కోసం తలపడ్డారు. నేటి ఎపిసోడ్‌లో రాహుల్, పునర్నవి మళ్ళీ గొడవ పడ్డారు. నన్ను ముట్టుకోకు వదిలేయ్ అంటూ పునర్నవి.. రాహుల్‌పై ఫైర్ అయింది. కోపం తగ్గాక రాహుల్ ను కవ్వించాలని చూసినప్పటికీ అది విఫలమైంది. 'నీ మొహం చూస్తేనే చిరాకు వస్తుంది' అంటూ రాహుల్ కూడా పునర్నవిని వేసుకున్నాడు. ఇక అదే కోపాన్ని రాహుల్.. మహేశ్‌పై తీసినట్టు కనిపించింది.

బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ చివరి అంకంలో వితిక, బాబా భాస్కర్ నువ్వానేనా అన్న రీతిలో తలపడ్డారు. వీరిలో ఒకరిది సహనం ఐతే ఇంకొకరిది అంతకు మించిన మొండితనం. దీంతో టాస్క్ మరింత రసవత్తరంగా మారింది. ఇక ఇంటిసభ్యులు రిక్షాలో కూర్చున్న పోటీదారులిద్దరినీ నానారకాలుగా విసిగించారు. అయినప్పటికీ వారిద్దరూ నవ్వుతూనే భరించారు. టాస్క్ లో భాగంగా ఎండలో మూడు స్వెటర్లు ధరించారు. అటు వర్షానికీ తడిచారు. వీటన్నింటికీ మించి ఒక్కొక్కరూ పది మిరపకాయలు తిన్నారు. కాగా ఉదయం ప్రారంభమైన టాస్క్ రాత్రి వరకూ కొనసాగింది. అన్నింటినీ కిందా మీద పడుకుంటూ ఎలాగోలా పూర్తి చేశారు. కానీ అసలు సమస్య ఇక్కడే స్టార్ట్ అయింది. బాబా, వితికలకు బాత్రూం వస్తోంది. ఉన్నచోటే పని కానిచ్చేయండి అని శ్రీముఖి ఓ సలహా విసిరింది. టైటిల్ అయినా వదులుకుంటా తప్ప అలాంటి పని చేయనంటూ వితిక ఖరాఖండిగా చెప్పింది. అయితే బాబా పాస్ కు వెళ్తాననడం నచ్చని వితిక అతన్ని రిక్షా నుంచి తోసేసింది. దీంతో ఇంటిసభ్యులందరూ కంగుతిన్నారు. ఏది ఏమైనప్పటికి బిగ్ బాస్ వితికను విన్నర్ గా ప్రకటించాడు. సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వితిక సెల్ఫిష్ గా ప్రవర్తించిందని.. తనవల్లే బాబా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయింది అని విమర్శిస్తున్నారు. మరికొంతమందేమో వితిక సరైన నిర్ణయం తీసుకుందని అభినందిస్తున్నారు. తాజా ప్రోమో ప్రకారం వితిక చేసిన పనికి నాగార్జున సైతంషాక్‌ అయినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement