Bigg Boss Fame Vithika Sheru Buys New Car, Details Inside - Sakshi
Sakshi News home page

Vithika Sheru: కొత్త కారు కొన్న వితికా, మొదటి కారు కంటే పది రెట్లు ఎక్కువ ఖరీదు!

Published Mon, Mar 7 2022 10:55 AM | Last Updated on Mon, Mar 7 2022 1:10 PM

Bigg Boss Fame Vithika Sheru Buys New Car, Details Inside - Sakshi

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ వితికా శెరు ఓ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. కారు కొన్న విషయాన్ని తన యూట్యూబ్‌ చానల్‌ ద్వారా వెల్లడించింది. 'నా జీవితంలో కారు కొంటానని ఊహించలేదు. కానీ ఆ తర్వాత మనకూ ఓ కారుంటే బాగుంటుంది కదా, ఇంత పెద్ద కారులో తిరిగితే ఎంత బాగుంటుందోనని కలలు కన్నాను, చివరికి ఆ కల సాకారమైంది' అని చెప్తూ ఉబ్బితబ్బిబ్బయింది. 

ఆ తర్వాత షోరూమ్‌కు వెళ్లి భారత్‌ హ్యుందాయ్‌ అల్కాజార్‌ కారును సొంతం చేసుకుని ఇంటికి తీసుకెళ్లింది. ఆ కారును చూసి ఆమె కుటుంబ సభ్యులు సర్‌ప్రైజ్‌ అయ్యారు. వితికా కొన్న కారు అదిరిందని మెచ్చుకున్నాడు ఆమె భర్త, నటుడు వరుణ్‌ సందేశ్‌. ఇక ఈ కారు ధర దాదాపు రూ.20 లక్షల దాకా ఉంటుందని తెలుస్తోంది.

ఈ సందర్భంగా వితికా మాట్లాడుతూ.. 'మాది మధ్యతరగతి కుటుంబం. భీమవరంలో పుట్టి హైదరాబాద్‌కు వచ్చి ఈ స్టేజీవరకు వచ్చానంటే కారణం నా కష్టంతో పాటు ప్రజల ఆశీర్వాదాలే! నేను మొదట్లో రెండున్నర లక్షలు పెట్టి ఓ కారు కొన్నాను. ఈ రోజు దానికి పది రెట్లు ఎక్కువ పెట్టి కారు కొన్నాను. చాలా సంతోషంగా ఉంది. నా చెల్లి పెళ్లి జరిగాక ఓసారి నా అకౌంట్‌ చెక్‌ చేసుకుంటే అందులో 150 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడీరోజు ఇక్కడిదాకా వచ్చానంటే అదంతా అభిమానుల వల్లే' అని చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement