స్పీల్‌బర్గ్ సినిమాకు జగపతిబాబు డబ్బింగ్ | Jagapathi Babu might lend his voice for The BFG | Sakshi
Sakshi News home page

స్పీల్‌బర్గ్ సినిమాకు జగపతిబాబు డబ్బింగ్

Published Sat, May 28 2016 12:40 PM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM

స్పీల్‌బర్గ్ సినిమాకు జగపతిబాబు డబ్బింగ్

స్పీల్‌బర్గ్ సినిమాకు జగపతిబాబు డబ్బింగ్

నెగెటివ్ పాత్రలతో ఆకట్టుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరో జగపతిబాబు, తన కెరీర్లో మరో టర్న్ తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలరిస్తున్న జగ్గుభాయ్, డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారుతున్నాడు. హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో రూపొందుతున్న అడ్వంచరస్ ఫాంటసీ ఫిలిం 'ద బిఎఫ్జి' సినిమా తెలుగు, తమిళ వర్షన్లకు గాత్రదానం చేస్తున్నాడు.

24 నాలుగు అడుగుల ఎత్తుండే ఓ భారీ మనిషితో స్నేహంగా ఉండే పదేళ్ల చిన్నారి కథ 'ద బిఎఫ్జి'. ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను రోనాల్డ్ డాల్హ్ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న 'ద బిఎఫ్జి' జూలై 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన భారీ మనిషికి జగపతిబాబు డబ్బింగ్ చెపుతుండటంతో దక్షిణాదిలో కూడా 'ద బిఎఫ్జి'కి మంచి క్రేజ్ ఏర్పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement