The BFG
-
పారితోషికం ఒక్క పైసా కూడా తీసుకోను
'కెరీర్ ప్రారంభంలో నా పాత్రకు ఇంకొకరు డబ్బింగ్ చెప్పేవారు. ఆ తర్వాత నా వాయిస్ లో ఉన్న మాస్ ఇమేజ్ ను గుర్తించింది రాంగోపాల్ వర్మ. కథేంటో.. సినిమా ఏంటో కూడా పెద్దగా తెలీదు. కానీ హాలీవుడ్ దర్శకదిగ్గజం స్టీవెన్ స్పీల్బర్గ్ మూవీ కావడంతో డబ్బింగ్ చెప్పడానికి ఒప్పుకున్నాను' అని టాలీవుడ్ నటుడు జగపతిబాబు అన్నారు. బేసిక్ గా తాను యానిమేషన్ మూవీలు చూడనని, అలాంటి తరహా సినిమాల కంటే రియాల్టీ ఉండే వాటినే చూస్తానని చెప్పుకొచ్చాడు. స్పీల్బర్గ్ దర్శకత్వంలో రిలయన్స్, డిస్నీ సంస్థలు నిర్మించిన ఫాంటసీ చిత్రం ‘ది బిఎఫ్జి’. ది బిగ్ ఫ్రెండ్లీ జెయింట్ అనేది ఉపశీర్షిక. జగపతిబాబు మాట్లాడుతూ.. ఈ మూవీలో ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పిన తాను పారితోషికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నాడు. కేవలం దిగ్గజ దర్శకుడు స్పీల్బర్గ్ తో ఒక్క ఫొటో దిగితే అదే తనకు బిగ్ రెమ్యూనరేషన్ అని పేర్కొన్నాడు. తన జీవితంలో వచ్చిన బెస్ట్ డబ్బింగ్ అవకాశమని, ఆ ప్రాజెక్టులో తాను భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. అయితే తన డ్రీమ్(స్పీల్బర్గ్ తో ఫొటో దిగడం) ఇంకా పూర్తి కాలేదన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో తండ్రి పాత్రలో, క్రేజ్ ఉన్న విలన్ పాత్రల్లో మెప్పిస్తోన్న జగపతి, తనకు చాలా డిమాండ్ ఉన్నా హాలీవుడ్ దర్శకుడిపై ఉన్న అభిమానంతోనే పారితోషికం తీసుకోనని చెప్పడం విశేషం. -
అంతా మేజిక్‌లా జరిగిపోయింది!
‘‘కథేంటో.. సినిమా ఏంటో.. ఏమీ తెలీదు. వాళ్లు ఏం చెబితే అది చేశాను. ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడం పెద్ద సవాల్ అనిపించింది’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో రిలయన్స్, డిస్నీ సంస్థలు నిర్మించిన ఫాంటసీ చిత్రం ‘ది బిఎఫ్జి’. ది బిగ్ ఫ్రెండ్లీ జెయింట్ అనేది ఉపశీర్షిక. ఈ నెలలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. బిగ్ జెయింట్ పాత్రకు డబ్బింగ్ చెప్పిన జగపతిబాబు మాట్లాడుతూ - ‘‘కెరీర్ ప్రారంభంలో నా పాత్రకు ఇంకొకరు డబ్బింగ్ చెప్పేవారు. నా వాయిస్‌ని గుర్తించింది రాంగోపాల్ వర్మ. ‘గాయం’ తర్వాత నుంచీ నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు వేరే పాత్రకు.. అందులోనూ ఇదే పాత్రకు హిందీలో అమితాబ్ బచ్చన్‌గారు, తెలుగులో నేను డబ్బింగ్ చెప్పడం ఆనందంగా ఉంది. ట్రైలర్లో వాయిస్ డిఫరెంట్‌గా ఉందని అందరూ ప్రశంసిస్తు న్నారు. నేను పెద్దగా కష్టపడిందేమీ లేదు. ఆ పాత్రకు వాయిస్ మార్చి ఎలా డబ్బింగ్ చెప్పానో నాకే తెలీదు. అంతా ఓ మేజిక్‌లా జరిగింది’’ అన్నారు. ‘‘ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రాన్ని అనువదించాలని నిర్ణయించిన తర్వాత తెలుగులో మాకు గుర్తొచ్చిన ఒకే ఒక్క పేరు జగపతిబాబు. ఇతర చిత్రాల్లో ఆయన డబ్బింగ్‌కి, ఇందులో డబ్బింగ్‌కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంతలా వాయిస్ చేంజ్ చేశారు’’ అని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధి శ్రీధర్ చెప్పారు. -
స్పీల్బర్గ్ సినిమాకు జగపతిబాబు డబ్బింగ్
నెగెటివ్ పాత్రలతో ఆకట్టుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరో జగపతిబాబు, తన కెరీర్లో మరో టర్న్ తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలరిస్తున్న జగ్గుభాయ్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారుతున్నాడు. హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో రూపొందుతున్న అడ్వంచరస్ ఫాంటసీ ఫిలిం 'ద బిఎఫ్జి' సినిమా తెలుగు, తమిళ వర్షన్లకు గాత్రదానం చేస్తున్నాడు. 24 నాలుగు అడుగుల ఎత్తుండే ఓ భారీ మనిషితో స్నేహంగా ఉండే పదేళ్ల చిన్నారి కథ 'ద బిఎఫ్జి'. ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను రోనాల్డ్ డాల్హ్ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న 'ద బిఎఫ్జి' జూలై 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన భారీ మనిషికి జగపతిబాబు డబ్బింగ్ చెపుతుండటంతో దక్షిణాదిలో కూడా 'ద బిఎఫ్జి'కి మంచి క్రేజ్ ఏర్పడుతోంది.