అంతా మేజిక్‌లా జరిగిపోయింది!
‘‘కథేంటో.. సినిమా ఏంటో.. ఏమీ తెలీదు. వాళ్లు ఏం చెబితే అది చేశాను. ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడం పెద్ద సవాల్ అనిపించింది’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో రిలయన్స్, డిస్నీ సంస్థలు నిర్మించిన ఫాంటసీ చిత్రం ‘ది బిఎఫ్‌జి’. ది బిగ్ ఫ్రెండ్లీ జెయింట్ అనేది ఉపశీర్షిక. ఈ నెలలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
బిగ్ జెయింట్ పాత్రకు డబ్బింగ్ చెప్పిన జగపతిబాబు మాట్లాడుతూ - ‘‘కెరీర్ ప్రారంభంలో నా పాత్రకు ఇంకొకరు డబ్బింగ్ చెప్పేవారు. నా వాయిస్‌ని గుర్తించింది రాంగోపాల్ వర్మ. ‘గాయం’ తర్వాత నుంచీ నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు వేరే పాత్రకు.. అందులోనూ ఇదే పాత్రకు హిందీలో అమితాబ్ బచ్చన్‌గారు, తెలుగులో నేను డబ్బింగ్ చెప్పడం ఆనందంగా ఉంది. ట్రైలర్‌లో వాయిస్ డిఫరెంట్‌గా ఉందని అందరూ ప్రశంసిస్తు న్నారు.
నేను పెద్దగా కష్టపడిందేమీ లేదు. ఆ పాత్రకు వాయిస్ మార్చి ఎలా డబ్బింగ్ చెప్పానో నాకే తెలీదు. అంతా ఓ మేజిక్‌లా జరిగింది’’ అన్నారు. ‘‘ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రాన్ని అనువదించాలని నిర్ణయించిన తర్వాత తెలుగులో మాకు గుర్తొచ్చిన ఒకే ఒక్క పేరు జగపతిబాబు. ఇతర చిత్రాల్లో ఆయన డబ్బింగ్‌కి, ఇందులో డబ్బింగ్‌కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంతలా వాయిస్ చేంజ్ చేశారు’’ అని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతినిధి శ్రీధర్ చెప్పారు.