రెండో దొంగాట
రెండో దొంగాట
Published Wed, Sep 4 2013 12:59 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
ఓ ఇరవైయేళ్ల కుర్రాడికి అనుకోకుండా వందకోట్ల రూపాయల డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బు ఎవరిది? ఆ అబ్బాయి దగ్గరకి ఎలా వచ్చింది? అతను ఆ డబ్బును ఏం చేశాడు? దానివల్ల అతను ఎదుర్కొన్న కష్టాలేంటి? ఈ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘జగత్‌జెంత్రి’. ‘దొంగాట-2’ దీనికి ఉపశీర్షిక. జగపతిబాబు ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి విజయ్ ఆదిరాజ్ దర్శకుడు.
డా.రామదాసు నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమా... పలు మలుపులు తిరిగి చివరకు ఓ మంచి సందేశంతో ముగుస్తుంది. జగపతిబాబు పాత్ర చిత్రణ కొత్తగా ఉంటుంది.
ఆయన నటన ఈ చిత్రానికి ప్రధాన బలం. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. రాహుల్ ప్రీతి, సురేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేమ్స్ వసంతన్.
Advertisement
Advertisement