‘అచ్చం శ్రీదేవిలానే ఉన్నావు’ | Janhvi Kapoor Photo Comments Read Carbon Copy Of Sridevi | Sakshi
Sakshi News home page

‘అచ్చం శ్రీదేవిలానే ఉన్నావు’

Published Tue, Jul 3 2018 2:25 PM | Last Updated on Tue, Jul 3 2018 4:43 PM

Janhvi Kapoor Photo Comments Read Carbon Copy Of  Sridevi - Sakshi

‍‘బాలీవుడ్‌ చాందిని’ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్‌ ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతుంది. జాన్వి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ ఫోటో కేవలం 2 గంటల్లోనే దాదాపు రెండు లక్షల లైక్‌లు, వేలాది కామెంట్స్‌తో హల్‌చల్‌ చేస్తుంది. అయితే ఈ ఫోటో కూడా అంత ప్రత్యేకమైనదేమి కాదు. ఎప్పుటి లాంటి ఫోటేనే. కానీ ఫోటోలో జాన్విని చూసిన వారికి మాత్రం శ్రీదేవి గుర్తుకొచ్చారు.

దాంతో ‘అచ్చు శ్రీదేవిలానే ఉన్నా’వంటూ కామెంట్‌ చేస్తున్నారు అభిమానులు. మరి కొందరు ‘ నీలో శ్రీదేవిని చూస్తున్నామ’ని కామెంట్‌ చేయగా, కొందరు ‘మీ అమ్మ(శ్రీదేవి) నీ రూపంలో జీవించే ఉంద’ని కామెంట్‌ చేశారు. మరొక అభిమాని ‘మీ కళ్లు చాలా ఎక్స్‌ప్రెసీవ్‌గా ఉన్నాయి...అచ్చు శ్రీదేవి గారిలా’నే అంటూ ప్రశంసించాడు. ఈ నెల 20న జాన్వి బాలీవుడ్‌ డెబ్యూట్‌ ‘ధడక్‌’ విడుదల కానుంది. దాంతో ప్రస్తుతం జాన్వి ‘ధడక్‌’ ప్రమోషన్‌ కార్యక్రమంలో  బిజీగా ఉంది.

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement