
సెప్టెంబర్ 5న జాసన్‌బర్నీ
హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం జాసన్‌బర్నీ ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ ఐదో తేదీన తెరపైకి రానుంది. ఆంగ్లంతో పాటు తమిళం,తెలుగు, హిందీ భాషల్లో 3డీ, 2డీ ఫార్మెట్లలో ప్రేక్షకలను థ్రిల్ చేయడానికి భారీ ఎత్తున రానందని చిత్ర నిర్మాణ సంస్థ యూనివర్సల్ యూనిట్ పేర్కొన్నారు. మాట్ డమన్ నటించిన తాజా చిత్రం ఇది. జాసన్ బర్నీ నటుడు మాట్ డమన్ నటించిన నాలుగవ సీక్వెల్ ఇది. ఇంతకు ముందు ఆయన నటించిన మూడు చిత్రాలు సంచలన విజయం సాధించాయి.
అయితే దాదాపు దశాబ్దం తరువాత మాట్ డమన్ నటించిన చిత్రం జాసన్ బర్నీ. ఆయనతో పాటు జూలియాస్టైల్స్,అలిసియ వెకేందర్, విన్సెంట్ కాస్సెల్, లామి లీజాన్స్ ముఖ్యపాత్రలను పోషించిన ఆ చిత్రానికి పాల్‌గ్రీన్ గ్రస్ దర్శకత్వం వహించారు. ఆయన క్రిష్టోఫర్ రేస్‌తో కలిసి ఈ చిత్ర కథను తయారు చేశారు. ఇందులో చిత్ర దర్శకుడు, కథానాయకుడు నిర్మాణంలో భాగస్వామ్యం కావడం విశేషం. ప్రాంక్‌మర్షల్, జెఫ్రీ వెయినర్, పాల్ గ్రీన్‌గ్రస్, మట్‌డమన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాబర్ట్ రుద్లమ్‌ను బేస్ చేసుకుని తయారు చేసిన కథతో తెరకెక్కించిన బ్రహ్మాండ చిత్రం జాసన్ బర్నీ అని చిత్ర వర్గాలు తెలిపారు.