
జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్‌డమ్‌లో చిత్ర ట్రైలర్‌లోని ఓ ఫ్రేమ్
సాక్షి, సినిమా : ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్‌డమ్’ చిత్ర రెండో ట్రైలర్ ఆదివారం విడుదలైంది. 2015లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన జురాసిక్ వరల్డ్ సినిమాకు ఇది సీక్వెల్.
అగ్నిపర్వతం బద్దలవడంతో డైనోసార్ల జాతికి ముప్పు వాటిల్లుతుంది. ఆ ఘోర ప్రమాదం నుంచి డైనోసార్ల జాతిని హీరో ఎలా రక్షించాడనే కథాంశంతో చిత్రం రూపొందుతోంది. ఆదివారం విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి బెయోనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 22న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment